Monday, February 24, 2025
HomeTrending Newsగుజరాత్‌ సీఎం అభ్యర్థిని ప్రకటించిన ఆప్‌

గుజరాత్‌ సీఎం అభ్యర్థిని ప్రకటించిన ఆప్‌

దేశ రాజకీయాల్లో నూతన శకానికి నాంది పలికింది. దేశ రాజకీయాల్లో సరికొత్త పద్దతులను అవలంబిస్తున్న ఆప్… ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీఎం అభ్యర్థిని ఎన్నుకునే విషయంలో పోల్ నిర్వహిస్తోంది. ఇటీవలే ముగిసిన పంజాబ్ ఎన్నికల్లో పోల్ ద్వారానే భగవంత్ మాన్ ను సీఎం అభ్యర్థిగా ఆప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. పంజాబ్ ఎన్నికల్లో ఆప్ విజయం సాధించగా… భగవంత్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు.

తాజాగా గుజరాత్ లోనూ ఆప్ పోల్ సంప్రదాయాన్నే కొనసాగించింది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన గుజరాత్ లో తన సీఎం అభ్యర్థిగా అసుదాన్ గాధ్విని ప్రకటించింది. తమ పార్టీ తరఫున ఎవరు సీఎం అభ్యర్థిగా ఉండాలో నిర్ణయించండి అంటూ గుజరాత్ ప్రజలకు సూచించిన ఆప్… పోల్ లో వచ్చిన ఫలితాల మేరకే ఇసుదాన్ గాధ్విని గుజరాత్ ఎన్నికల్లో తమ పార్టీ సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. గాధ్వి పేరును అధికారికంగా ప్రకటించారు.

రాజకీయ నేతగా మారక ముందు ఇసుదాన్ గాధ్వి జర్నలిస్టుగా పని చేశారు. వి టీవీ గుజరాతికి ఎడిటర్ గా వ్యవహరించిన ఆయన.. వి టీవీ న్యూస్ కూ ఎడిటర్ గా పని చేశారు. అంతకుముందు వి టీవీలో ప్రసారమైన మహామంతన్ కు యాంకర్ గా వ్యవహరించారు. ఆప్ ప్రారంభం తర్వాత జర్నలిజానికి స్వస్తి చెప్పిన గాధ్వి… రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్