Thursday, May 8, 2025
HomeTrending NewsIT Employees: నారా బ్రాహ్మణికి ఐటి ఉద్యోగుల సంఘీభావం

IT Employees: నారా బ్రాహ్మణికి ఐటి ఉద్యోగుల సంఘీభావం

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఐటి ఉద్యోగులు సంఘీభావం తెలియజేశారు.  హైదరాబాద్ లోని వివిధ ఐటి కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు నేటి ఉదయం రాజమండ్రికి  బయల్దేరి వెళ్ళారు.  ‘ఐ యామ్ విత్ బాబు’ ప్లే కార్డులు చేతబూని రాజమండ్రిలో నారా లోకేష్ బస చేస్తున్న నివాసం వద్దకు చేరుకున్నారు. అక్కడ వారు నారా బ్రాహ్మణిని కలుసుకుని తమ మద్దతు తెలిపారు.

ప్రస్తుతం తాము ఐటి లో జాబ్ చేస్తున్నామంటే అది చంద్రబాబు వేసిన భిక్షేనని వారు పేర్కొన్నారు. కొండలు, గుట్టలు ఉన్న ప్రాంతంలో ఐటి టవర్ నిర్మాణం పూర్తి చేసి, హైదరాబాద్ కు ఐటి పరిశ్రమలు తరలి రావడంలో బాబు చేసిన కృషి ఎంతో ఉందని వారు అన్నారు.

ఈ సందర్భంగా బ్రాహ్మణి మాట్లాడుతూ రాజమండ్రి వస్తున్న సమయంలో  పోలీసులు  ఐటి ఉద్యోగుల వాహనాలు, ఫోన్ చాటింగ్ లు చెక్ చేయడం షాక్ కు గురిచేసిందన్నారు.  చంద్రబాబు నాయుడుకు మీ అందరి మద్దతు చూసి గర్వ పడుతున్నానని బదులిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్