Saturday, January 18, 2025
HomeTrending NewsNari Shakti Vandan: మహిళా బిల్లు...తెలంగాణ రాజకీయ ముఖచిత్రం

Nari Shakti Vandan: మహిళా బిల్లు…తెలంగాణ రాజకీయ ముఖచిత్రం

మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులోకి వస్తే తెలంగాణలో రాజకీయంగా గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయి. జనగణన, కులగణనతో ముడిపడి ఉన్న మహిళా బిల్లులో ఓ బీ సి లకు ఉపకోట కల్పించాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇది కూడా జరిగితే రాష్ట్ర రాజకీయాల ముఖచిత్రమే మారిపోతుంది. బిసీ మహిళలకు ఉపకోటపై ఇప్పుడు స్పష్టత రాకపోయినా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

ఇన్నాళ్ళు మహిళా బిల్లు చర్చకు వస్తేనే కొన్ని పార్టీలు వ్యతిరేకించేవి. వారిని అడ్డం పెట్టుకొని ప్రధాన పార్టీలు బిల్లు ఆమోదానికి చొరవ చూపకుండా… రాజకీయం చేశాయి. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో  మహిళా బిల్లు సునాయాసంగా గట్టెక్కే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి.

అయితే ఓ బీ సి లకు రిజర్వేషన్  అంశంపై స్పష్టత రావల్సి ఉంది. అదేవిధంగా మైనారిటీ కోటా కూడా కల్పించాలని ఎంఐఎం, తృణముల్ కాంగ్రెస్, సమాజ్ వాది పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.

Telangana Budget Session

మహిళా బిల్లు 2027 నుంచి అమలులోకి వస్తుందని ప్రాథమికంగా బిల్లులో పేర్కొన్నారు. ఆచరణలోకి వచ్చే నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. దీంతో తెలంగాణ శాసనసభలో 119 నియోజకవర్గాల నుంచి శాసనసభ స్థానాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో 119స్థానాలు ఉన్నాయి. వాటిలో 33శాతం సీట్లు అంటే సుమారు 40స్థానాల్లో మహిళలు ప్రాతినిధ్యం వహించాలి. తెలంగాణ అసెంబ్లీలో తాజా లెక్కల ప్రకారం … 63 స్థానాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.

మహిళలను రిజర్వ్ చేసేందుకు దీన్నే ప్రాతిపదికగా తీసుకుంటే సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, జగదీశ్వర్ రెడ్డి, టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ సీనియర్ నేతలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు తదితరులు తమ స్థానాలను మార్చుకోవలసి ఉంటుంది. ఉమ్మడి ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలలో మెజార్టీ స్థానాల్లో మహిళల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ స్థానాలను మహిళలకు కేటాయించాల్సి వస్తే, ప్రధాన పార్టీల్లోని సీనియర్లు ఇతర జిల్లాలకు వెళ్లాల్సి వస్తుంది.

పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు :

  1. ఆదిలాబాద్ – 114016 (జోగు రామన్న)
  2. బోథ్(ఎస్టీ) – 102576 (అనిల్ జాదవ్)
  3. ఖానాపూర్(ఎస్టీ) – 104537 (భూక్య జాన్సన్ రాథోడ్ నాయక్)
  4. నిర్మల్ – 122696 (ఇంద్రకరణ్ రెడ్డి)
  5. ముధోల్ – 119092 (విట్టల్ రెడ్డి)
  6. ఆర్మూర్ – 105657 (ఆశన్న గారి జీవన్ రెడ్డి)
  7. బోధన్ – 106222 (మహ్మద్ షకిల్ అహ్మద్)
  8. బాన్సువాడ – 94941 (పోచారం శ్రీనివాస రెడ్డి)
  9. నిజామాబాద్ అర్బన్ – 138615(బిగాల గణేశ్ గుప్త)
  10. నిజామాబాద్ రూరల్ – 127602 (బాజిరెడ్డి గోవర్ధన్)
  11. బాల్కొండ – 111424 (వేముల ప్రశాంత్ రెడ్డి)
  12. జుక్కల్ (ఎస్సీ) – 95512 (హన్మంత్ షిండే)
  13. ఎల్లారెడ్డి – 107603(జాజుల సురేందర్)
  14. కామారెడ్డి – 117783(కేసీఆర్)
  15. కోరట్ల – 116536 (డా. సంజయ్ కల్వకుంట్ల)
  16. జగిత్యాల – 109853 (డా. ఎం. సంజయ్ కుమార్)
  17. ధర్మపురి(ఎస్సీ)- 107068 (కొప్పుల ఈశ్వర్)
  18. మంథని – 110840 (పుట్టా మధు)
  19. పెద్దపల్లి – 120120 (దాసరి మనోహర్ రెడ్డి)
  20. చొప్పదండి(ఎస్సీ)- 116006 (సుంకే రవి శంకర్)
  21. మానకొండూర్(ఎస్సీ)- 107087 (రసమయి బాలకిషన్)
  22. హుజూరాబాద్ – 119632 (పాడి కౌశిక్ రెడ్డి)
  23. వేములవాడ – 107839 (చల్మెడ లక్ష్మీ నరసింహారావు)
  24. సిరిసిల్ల – 116066 (కేటీఆర్)
  25. ఆంధోల్(ఎస్సీ) – 114077 (చంటి క్రాంతి కిరణ్)
  26. సంగారెడ్డి – 107750 (చింతా ప్రభాకర్)
  27. మెదక్ – 105075 (ఎం. పద్మా దేవేందర్ రెడ్డి)
  28. నర్సాపూర్ – 104712 (పెండింగ్)
  29. హుస్నాబాద్ -114218 (వొడిదెల సతీశ్ కుమార్)
  30. సిద్ధిపేట – 109938 (హరీశ్ రావు)
  31. దుబ్బాక – 95375 (కొత్త ప్రభాకర్ రెడ్డి)
  32. గజ్వేల్ – 126814 (కేసీఆర్)
  33. తాండూర్ – 111529 (పైలెట్ రోహిత్ రెడ్డి)
  34. కొండంగల్ – 108157 (పట్నం నరేందర్ రెడ్డి)
  35. దేవరకొండ – 107951 (రవీంద్ర కుమార్ రమావత్)
  36. గద్వాల – 118447 (బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి)
  37. అలంపూర్(ఎస్సీ)- 111439 (వీఎం అబ్రహం)
  38. నాగార్జున సాగర్ – 109992 (నోముల భగత్)
  39. మిర్యాలగూడ – 107265 (నల్లమోతు భాస్కర్ రావు)
  40. నల్లగొండ – 114211 (కంచర్ల భూపాల్ రెడ్డి)
  41. హుజూర్ నగర్ – 117299 (సైదిరెడ్డి)
  42. కోదాడ – 114706 (బొల్లం మల్లయ్య యాదవ్)
  43. సూర్యపేట – 113049 (జగదీశ్ రెడ్డి)
  44. జనగామ – 110512 (పెండింగ్)
  45. ఘన్‌పూర్ స్టేషన్(ఎస్సీ)- 117439 (కడియం శ్రీహరి)
  46. మహబూబాబాద్(ఎస్టీ) – 119343 (బానోత్ శంకర్ నాయక్)
  47. నర్సంపేట – 110271 (పెద్ది సుదర్శన్ రెడ్డి)
  48. వరంగల్ ఈస్ట్ – 120903 (నన్నపునేని నరేందర్)
  49. వర్ధన్నపేట(ఎస్సీ)- 125541 ఆరూరి నరేశ్
  50. పరకాల – 105788 (చల్లా ధర్మారెడ్డి)
  51. వరంగల్ వెస్ట్ – 134053 (దాస్యం వినయ్ భాస్కర్)
  52. పినపాక(ఎస్టీ) – 94012 (రేగా కాంతారావు)
  53. ఇల్లందు(ఎస్టీ) – 105638 (బానోత్ హరిప్రియ నాయక్)
  54. కొత్తగూడెం – 117338 (వనమా వెంకటేశ్వర రావు)
  55. అశ్వారావుపేట(ఎస్టీ) – 76305 (మెచ్చా నాగేశ్వర్ రావు)
  56. భద్రాచలం(ఎస్టీ) – 74121(డా. తెల్లం వెంకట్రావు)
  57. ఖమ్మం – 159527 (పువ్వాడ అజయ్ కుమార్)
  58. పాలేరు – 114636 (కందాల ఉపేందర్ రెడ్డి)
  59. మధిర(ఎస్సీ) – 107698 (లింగాల కమల్ రాజు)
  60. వైరా(ఎస్టీ) -94024 (బానోత్ మదన్ లాల్)
  61. సత్తుపల్లి(ఎస్సీ)- 115405 (సండ్ర వెంకట వీరయ్య)
  62. నారాయణపేట – 107139 (ఎస్.రాజేందర్ రెడ్డి)
  63. మక్తల్ – 111870 (చిట్టెం రామ్మోహన్ రెడ్డి)
RELATED ARTICLES

Most Popular

న్యూస్