Tuesday, April 1, 2025
Homeసినిమాప్ర‌భాస్-మారుతి ప్రాజెక్ట్ ఉందా? లేదా?

ప్ర‌భాస్-మారుతి ప్రాజెక్ట్ ఉందా? లేదా?

Is it? : పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ఇటీవ‌ల రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన రాధేశ్యామ్ చిత్రం ఏమాత్రం ఆక‌ట్టుకోలేక‌పోయింది. దీంతో అభిమానులు ఆదిపురుష్‌, స‌లార్ చిత్రాల పైనే న‌మ్మ‌కం పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే.. ప్ర‌భాస్.. మారుతితో సినిమా చేయ‌నున్నార‌ని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. అంతే కాకుండా.. ఈ నెల 10న ప్ర‌భాస్, మారుతి మూవీ ఓపెనింగ్ అని టాక్ వినిపించింది.

అయితే.. ఈ నెల 10వ తారీఖు వ‌చ్చింది కానీ.. మూవీ మాత్రం స్టార్ట్ కాలేదు. కార‌ణం ఏంటి అని ఆరా తీస్తే.. కొన్ని వారాల క్రితం ప్ర‌భాస్ మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ప్ర‌స్తుతం ప్రభాస్ విశ్రాంతి తీసుకుంటున్నాడు. అతను సాధారణ స్థితికి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ ను ప్రకటించాలి అనుకుంట‌న్నార‌ట‌. మ‌రో విష‌యం ఏంటంటే.. మారుతి అండ్ టీమ్ క‌థ పై క‌స‌ర‌త్తు చేస్తున్నార‌ట‌. క‌థ‌లో సెకండాఫ్ ఇంకా రెడీ కాలేద‌ట‌. క‌థ అంతా రెడీ అయిన త‌ర్వాత ప్ర‌భాస్ కి చెప్పి అప్పుడు ఈ సినిమాని ఎప్పుడు మొదలు పెట్టాలనేది నిర్ణ‌యిస్తార‌ట‌. అందుచేత ఈ ప్రాజెక్ట్ ఉంటుంది కానీ కాస్త  లేట్ గా మొదలవుతుందనే వార్త వినిపిస్తోంది.

Also Read : ప్ర‌భాస్ హాలీవుడ్ మూవీ?

RELATED ARTICLES

Most Popular

న్యూస్