Thursday, May 8, 2025
Homeస్పోర్ట్స్చెన్నైసూపర్ కింగ్స్: ధోనీ వారసుడిగా జడేజా

చెన్నైసూపర్ కింగ్స్: ధోనీ వారసుడిగా జడేజా

Jadeja to lead: ఎల్లుండి నుంచి ఐపీఎల్ 2022 టోర్నీ మొదలవుతున్న నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్  బాధ్యతల నుంచి మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ తప్పుకున్నాడు.  ఈ విషయాన్ని చెన్నై ఫ్రాంచైజీ యాజమాన్యం తెలియజేస్తూ కొత్త సారధిగా రవీంద్ర జడేజా ను నియమిస్తున్నట్లు ప్రకటించింది.  ధోనీ చెన్నై జట్టుతో కొనసాగుతాడని స్పష్టం చేసింది. జడేజా 2012 నుంచి చెన్నై జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

2008 నుంచి ధోనీ చెన్నైకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. మధ్యలో 2016, 2017 సంవత్సరాల్లో చెన్నై పై బహిష్కరణ వేటు వేసినప్పుడు పూణే జట్టుకు ధోనీ ప్రాతినిద్యం వహించాడు. 2018 లో  తిరిగి చెన్నై జట్టు ఐపీఎల్ లో చేరింది. మళ్ళీ ధోనీ చెన్నైకు వచ్చాడు.

ఐపీఎల్ ఆరంభం నుంచీ ఇప్పటివరకూ నాలుగు సార్లు టైటిల్ గెల్చుకున్న చెన్నై,  మరో ఐదు సార్లు రన్నరప్ గా నిలిచింది.

ఐపీఎల్ 15వ సీజన్ లో భాగంగా ఎల్లుండి జరిగే ప్రారంభ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కోల్ కతా నైట్ రైడర్స్ తో తలపడనుంది.

Also Read : టాటా ఐపీఎల్ షెడ్యూల్ విడుదల

RELATED ARTICLES

Most Popular

న్యూస్