వచ్చే ఎన్నికల్లో కుప్పం నుంచి భరత్ ను గెలిపిస్తే మంత్రిపదవి ఇచ్చి ప్రోత్సహిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. బీసీలు ఎక్కువగా ఉన్న స్థానం కుప్పం నియోజకవర్గమని బీసీలకు మంచి చేస్తున్నామంటే, అది ప్రతి పనిలోనూ కనిపించాలని చెప్పారు. బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన మంచి వ్యక్తి, ఐఏఎస్ అధికారి చంద్రమౌళిని గతంలో అభ్యర్థిగా పెట్టామని, దురదృష్టవశాత్తూ ఆయన మనకు దూరమయ్యారని, తర్వాత ఆయన కుమారుడు భరత్‌ను తీసుకు వచ్చామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించిన జగన్ తొలుత కుప్పం నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు
కుప్పం తన సొంత నియోజకవర్గంతో సమానమని, చంద్రబాబు హయాంలో కన్నా.. ఈ మూడేళ్లలో కుప్పంకు అత్యధికంగా మేలు జరిగిందని చెప్పారు. కుప్పం మున్సిపాల్టీకి సంబంధించి రూ.65 కోట్ల విలువైన పనులను మంజూరు చేస్తున్నామన్నారు. కుప్పం అభివృద్ధికి అన్ని వేళలా అండగా ఉంటానని భరోసా ఇస్తూ 175 కి 175 సీట్లు గెలిచే పరిస్థితి ఇక్కడినుంచే మొదలు కావాలని ఆకాంక్షించారు. ఈ కారణంతోనే పార్టీ కార్యకర్తలతో సమావేశాన్ని కుప్పంనుంచే ప్రారంభిస్తున్నామన్నారు
జగన్ మాట్లాడుతూ…
- కుప్పం అంటే టీడీపీకి ఒక కంచుకోట అని, ఎప్పటినుంచో చంద్రబాబుగారికి మద్దతుగానే ఉందని అని బయట ప్రపంచం అంతా అనుకుంటారు
- వాస్తవం ఏంటంటే.. బీసీలు ఎక్కువగా ఉన్న స్థానం కుప్పం నియోజకవర్గం
- నియోజజకవర్గ ఇన్ చార్జ్ భరత్‌ను ఇదేస్థానంలో నిలబెడతారా? లేదా పై స్థానంలోకి తీసుకు వెళ్తారా? అన్నది మీమీద ఆధారపడి ఉంది
- భరత్‌ను గెలుపించుకు రండి మంత్రిగా మీ కుప్పానికి ఇస్తాను
- కుప్పం బ్రాంచ్ కెనాల్ పని జరుగుతూ ఉంది. సంవత్సరంలోపు దాన్ని పూర్తిచేస్తాం
- కుప్పం నియోజకవర్గాన్ని నా నియోజకవర్గంగానే చూస్తాను, అన్నిరకాలుగా మద్దతు ఇస్తాను
- రాజకీయాల్లో మనం ఉన్నందుకు సంతోషం కలుగుతుంది
- రాజకీయనాయకుడిగా మనకు ఉత్సాహం ఎప్పుడు వస్తుందంటే.. ప్రజలు ఆశీర్వదిస్తున్నప్పుడు, వారు మనల్ని దీవిస్తున్నప్పుడు వస్తుంది
- ఇవాళ కాలర్ ఎగరేసుకుని… మనం గర్వంగా ప్రజల్లోకి వెళ్తున్నాం
- ఈ ఆశీస్సులు ఇస్తున్న ప్రజల మద్దతు తీసుకునే బాధ్యత మీది
- 175కి 175 సీట్లు గెలిచే వాతావరణం కుప్పంనుంచే ప్రారంభం కావాలి
- మీ భుజస్కంధాలమీద ఈ బాధ్యతను పెడుతున్నాను
- మీ మీద ఆ నమ్మకం నాకు ఉంది, రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలి
- కార్యకర్తలకు అన్నిరకాలుగా తోడుగా నిలుస్తాం
ఈ కార్యక్రమంలో విద్యుత్, అటవీ పర్యావరణం, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ భరత్, యాభై మందికి పైగా పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు,.
Also Read : గతంలో పెత్తందారీ పాలన :సిఎం జగన్