Sunday, November 24, 2024
HomeTrending News#4YearsofJaganrule: గుంటనక్కలు నిద్ర లేచాయి: సజ్జల

#4YearsofJaganrule: గుంటనక్కలు నిద్ర లేచాయి: సజ్జల

ఎన్నికల హామీలను తూచ తప్పకుండా అమలు చేసిన ఘనత సిఎం జగన్ కు మాత్రమే దక్కుతుందని, ఇలా చేసిన నేత గతంలో ఎవరూ లేరని,  భవిష్యత్తులో మరే నేతకూ ఇది సాధ్యం కూడా కాదని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. కబుర్లు చెబుతూ కాలం గడిపేవారు హామీలు నేరవేర్చలేరని, పైగా చంద్రబాబుకు అసలు సాధ్యం కాదని స్పష్టం చేశారు. హామీలు నెరవేర్చిన చరిత్ర బాబుకు అసలే లేదన్నారు.  వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నాలుగేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆ పార్టీ జెండా ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఉమ్మారెడ్డితో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, మంత్రి మేరుగ నాగార్జున తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఏ పార్టీ అయినా ఎన్నికల మేనిఫెస్టో ద్వారానే ప్రజల్లోకి వెళుతుందని.. తన పాదయాత్రలో ప్రజలు ఏయే అంశాలు తన దృష్టికి తీసుకు వచ్చారో అన్ని అంశాలనూ ఎన్నికల ప్రణాళికలో పొందు పరిచారని ఉమ్మారెడ్డి వెల్లడించారు.  నాలుగేళ్ళుగా హామీల అమల్లో సఫలం అయ్యారని, ఇప్పటికి 98.5 శాతం పూర్తి చేశారని చెప్పారు. మిగిలినవి కొన్ని సాంకేతిక కారణాలతో అమలు కాలేదని వివరణ ఇచ్చారు.

సంక్షేమ సంతకం ద్వారా నాలుగేళ్ల పాలనతో సిఎం జగన్ చరిత్ర సృష్టించారని, ఇచ్చిన హామీలు నెరవెర్చారని సజ్జల చెప్పారు.  ఏడాదిలో ఎన్నికలు రాబోతున్న సమయంలో గుంట నక్కలు నిద్రలేచాయని, వాటి పగటి వేషాలు మొదలయ్యాయని, చంద్రబాబు కొత్త హామీలతో ముందుకొచ్చారని విమర్శించారు. మరో అవకాశం ఇవ్వాలంటూ ప్రజలను అడుగుతున్నారని, కానీ నాలుగేళ్ళుగా జగన్ ప్రభుత్వం ఏమి చేసిందో కోటి 60లక్షల కుటుంబాలకు తెలుసని వ్యాఖ్యానించారు. గడప గడపకూ మన ప్రభుత్వం, జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాల ద్వారా ప్రజలు తమ ఆశీర్వాదం ఇచ్చారని గుర్తు చేశారు.  బాబు హామీల్లో కొత్తదనం లేదన్నారు.

తాము అమలు చేసిన 27పథకాలు జగన్ ఎత్తేశారంటూ బాబు అంటున్నారని, కానీ వాటి పేర్లు మాత్రం చెప్పడంలేదని మండిపడ్డారు. ఏదైనా అంటే అన్నా క్యాంటిన్,  చంద్రన్న కానుక చెబుతారని.. వాటిలో కూడా తన హెరిటేజ్ సంస్థకు లాభంచేకూర్చేలా చేసుకున్నారని, కరువులో కూడా స్వార్ధం వచ్చేలా ఆలోచనలు చేసిన చరిత్ర బాబుదేనని సజ్జల ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

న్యూస్