Sunday, May 19, 2024
HomeTrending NewsTDP: అవి రైతు దగా కేంద్రాలు: ప్రత్తిపాటి

TDP: అవి రైతు దగా కేంద్రాలు: ప్రత్తిపాటి

రైతులకు సాయం అనేది మాటల్లో తప్ప చేతల్లో ఏమాత్రం లేదని మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. రైతు దినోత్సవం జరుపుకునే అర్జత ఈ ముఖ్యమంత్రికి ఉందా అని ప్రశ్నించారు. క్రాప్ ఇన్సూరెన్స్ ను గందరగోళంగా మార్చారని, కేవలం వైసీపీ కార్యకర్తలకే అందిస్తున్నారని, వైసీపీ తాడిపత్రి ఎమ్మెల్యే 14 లక్షల రూపాయలు బీమా కింద కాజేశారని ఆరోపించారు. ఆర్బీకేల్లో లబ్ధిదారుల జాబితాను ఎందుకు ప్రదర్శించడం లేదని అడిగారు. మంగళగిరిలోని టిడిపి  కేంద్ర కార్యాలయంలో పుల్లారావు మీడియాతో మాట్లాడారు.

నాలుగేళ్లలో రైతులు తీవ్రంగా నష్టపోయారని,  సంక్షోభంలోకి నెట్టబడ్డారని అన్నారు. పాదయాత్రలో రైతులకు ఇచ్చిన హామీలు జగన్ గాలికొదిలేశారని, మూడు వేల కోట్లతో ఏర్పాటు చేస్తామని చెప్పిన ధరల స్థిరీకరణ నిధి  ఏమైందని నిలదీశారు. రాష్టంలో 92.5 శాతం రైతు కుటుంబాలు అప్పుల్లో ఉన్నాయన్నారు. పది లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతింటే 1117 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారని, ఏడు జిల్లాల్లో కోటి రూపాయలు లోపే పరిహాం అందిందని వెల్లడించారు. బీమా చెల్లింపులో పక్షపాతం చూపుతున్నారని, కేవలం వైసీపీ వారికే ఇస్తున్నారని మండిపడ్డారు.

రైతు తరఫున ఇన్సురెన్స్ ప్రీమియం తామే చెల్లిస్తామని చెప్పి మోసం చేశారన్నారు. దిగుబడి ఆధారిత బీమాను ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా, వాతావరణ ఆధారిత బీమా ప్రీమియం ను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఆమలు చేస్తోందని, ఇది కూడా 17 జిల్లాలకు మాత్రమే అమలు చేస్తున్నామన్నారు. బాబు సిఎంగా ఉన్నప్పుడు ఐదేళ్ళలో 4, 007 కోట్ల రూపాయలు చెల్లించామని, కానీ జగన్ ఈ నాలుగేళ్ళలో 1965 కోట్లు మాత్రమే  ఇచ్చారని అన్నారు.  రాష్ట్రంలో ఇప్పటికే మూడు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. అకాల వర్షాలు నష్ట పోయిన రైతులను ఆదుకోవడంలో కూడా  ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.  రైతు భరోసా కేంద్రాలపై కూడా ప్రత్తిపాటి విమర్శలు గుప్పించారు. వాటిని రైతు దగా కేంద్రాలుగా మార్చారని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్