Anti Incumbency: సాధారణ ఎన్నికల నాటికి, నేటి ఉపఎన్నికకూ కనీసం అధికార వైఎస్సార్సీపీ పది వేల ఓట్లు కూడా అదనంగా రాబట్టుకోలేకపోయిందని టిడిపి అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. పార్టీ ముఖ్య నేతలతో అయన టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రధాన ప్రతిపక్షం పోటీలో లేకున్నా, డబ్బు విపరీతంగా పంచినా, సానుభూతి తోడైనా కూడా గత ఎన్నికల కంటే ఆ పార్టీ ఓట్లు పెంచుకోలేకపోయిందని విశ్లేషించారు. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు ఇది నిదర్శనమన్నారు.
రాజధాని నిర్మించలేని నేతలకు ఇక్కడి భూములు అమ్మే హక్కు లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలోని భూమిని ఒక్కో ఎకరాను పది కోట్ల రూపాయలకు అమ్మడం దారుణమన్నారు. అమరావతిని స్మశానం అని మాట్లాడిన వైసీపీ నేతలు ఇప్పుడేం చెబుతారని ప్రశ్నించారు. నిర్మాణంలో ఉన్న భవనాలను ఇప్పటివరకూ నిర్లక్ష్యం చేసి ఇప్పుడు ప్రైవేట్ సంస్థలకు అద్దెకు ఇస్తున్నారని విమర్శించారు.
ఒంటరి మహిళల పెన్షన్ అర్హత వయసును 50 ఏళ్ళకు పెంచారని, అమ్మ ఒడి పథకంలో నిబంధనలు పెట్టి 52 వేల మందికి తీసివేశారని బాబు పార్టీ నేతలతో అన్నారు. నిధుల కొరత కారణంగానే దుల్హన్ పథకం నిలిపివేశామని ప్రభుత్వం హైకోర్టులో ఒప్పుకుందని విమర్శించారు.
Also Read : బొత్సకు పద్మశ్రీ ఇవ్వాలి: బాబు