Monday, May 20, 2024
HomeTrending Newsబాక్సైట్ దోచుకున్నారు: చంద్రబాబు ఆరోపణ

బాక్సైట్ దోచుకున్నారు: చంద్రబాబు ఆరోపణ

నమ్మి ఓటేస్తే కాటేసిన వ్యక్తి వైఎస్ జగన్ అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. గిరిజనుల కోసం తాను 16 పథకాలు తీసుకొస్తే వాటిని తీసేశారని.. అలాంటి  జగన్ మళ్ళీ మీ ఓట్ల కోసం వస్తున్నాడని దుయ్యబట్టారు. తమ హయంలో గిరిజనులకు బెస్ట్ ఆవైలబుల్ స్కూల్స్ తీసుకొస్తే వాటిని కూడా తీసివేశారని విస్మయం వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల్లో లాటరైట్ ముసుగులో బాక్సైట్ దోపిడీకి పాల్పడ్డారని, దాన్ని భారతి సిమెంట్ కు తరలించారని ఆరోపించారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో బాబు ప్రసంగించారు.

గత ఎన్నికల్లో గిరిజన నియోజకవర్గాల్లో ఏ ఒక్కటీ తమ పార్టీ గెలవలేదని, దానికి ఎంతో బాధపడ్డానని… కానీ జగన్ ఎంతో కొంత చేస్తాడని అనుకుంటే ఏమీ చేయలేదని ఎద్దేవా చేశారు. గిరిజన ప్రాంతాల్లో  స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పించాలని తమ ప్రభుత్వం జీవో నంబర్ 3 తీసుకువస్తే దాన్ని జగన్ రద్దు చేశారని, మళ్ళీ తాము రాగానే దాన్ని అమలు చేష్టామని భరోసా ఇచ్చారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ఫ్యాన్ ముక్కలు కావడం ఖాయమని, విరిగిన ఈ ముక్కలను చెత్తబుట్టలో వేయాలని విజ్ఞప్తి చేశారు. బిజెపి, టిడిపి, జనసేన అభ్యర్ధులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని, సూపర్ సిక్స్ పేరుతో తాము మంచి మేనిఫెస్టో ఇచ్చామన్నారు. నిన్న కూటమి తరఫున విజయవాడలో మోడీతో కలిసి నిర్వహించిన రోడ్ షో సూపర్ సక్సెస్ అయ్యిందని, దీనితో వైసీపీ నేతల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయని, కాడి పడేశారని అన్నారు.

బటన్లు నొక్కడం కాదని, రాష్ట్రంలో సంపద సృష్టించడం ముఖ్యమని… మోడీ కూడా బటన్లు నొక్కినా ఎప్పుడూ చెప్పుకోలేదని చెప్పారు. రాష్ట్రంలో జగన్ బటన్ నొక్కినా  జనవరి నుంచి ఇంతవరకూ లబ్దిదారుల అకౌంట్లలో నిధులు జమ కాలేదని, కానీ 16 వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు దోచిపెట్టారని మండిపడ్డారు. ఖజానా ఖాళీగా ఉందని… కానీ ఎన్నికల సంఘం ఆపిందని నెపం వేస్తున్నారని బాబు ఫైర్ అయ్యారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్