సామాజిక న్యాయాన్ని దేశానికి చాటిన నేత మన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె. నారాయణస్వామి కొనియాడారు. నాలుగున్నర నెలల పాలనలో తమ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు పాలనలో పెద్దపీట వేసిందని అన్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో సామాజిక సాధికారయాత్ర దిగ్విజయంగా సాగింది. స్థానిక ఎమ్మెల్యే బ్రిజేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ యాత్రలో డిప్యూటీ సీఎంలు అజాంద్ బాషా, నారాయణస్వామి, మాజీమంత్రి అనిల్‌కుమార్‌యాదవ్, ఎంపీ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 76 ఏళ్ళలో ఎంతో మంది ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా పనిచేశారని కానీ ఏ ఒక్కరూ సామాజిక సాధికారత దిశలో ఆలోచించలేదని పేర్కొన్నారు. జగన్ అండతో తాను రెండు పర్యాయాలు ఎమ్మెల్యే, మంత్రి, ఉపముఖ్యమంత్రిగా ఉన్నానని వెల్లడించారు. మొట్టమొదటిసారిగా మైనార్టీ మహిళను శాసనమండలి వైస్‌ఛైర్మన్‌గా నియమించారని గుర్తు చేశారు. మైనార్టీ పక్షపాతి ప్రభుత్వం దేశంలో ఏపీ మాత్రమేనని స్పష్టం చేశారు. 2024 జగనన్నను మరోసారి సిఎంగా చేసుకోవడం బడుగు బలహీన వర్గాల వారికి చారిత్రక అవసరమని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఆముదాలవలసలో
గత ప్రభుత్వం పేదలను, బడుగు బలహీన వర్గాలను పట్టించుకోలేదనే… ప్రజలు తిరిగబడి జగన్ ప్రభుత్వాన్ని ఎన్నుకొన్నారని స్పీకర్ తమ్మినేని సీతారామ్ అన్నారు. కారు చీకట్లో కాంతి రేఖగా జగన్ ని ప్రజలు గుర్తించారని కొనియాడారు. ప్రజల ఆశలను, ఆశయాలను సాకారం చేసినందునే సాధికార యాత్రకు జనం ఎగబడుతున్నారన్నారు. తన వల్ల మంచి జరిగితేనే తనకు ఓటు వేయ్యాలని లేకుంటే వద్దని సీఎం జగన్ అడగగలుగుతున్నారని వ్యాఖ్యానించారు పెత్తందారీ వ్యవస్థలో బానిసలుగా ఉన్న బడుగులకు విముక్తిని కలిగించేందుకు జగన్ పోరాడుతున్నారు. చేయూతనిచ్చిన నేత జగన్ ను చేజార్చుకుంటామా అని ప్రజలను ప్రశ్నించారు. భారీ ఎత్తున తరలివచ్చిన అశేష జనవాహిని స్వాగత హర్ష ధ్వానాల మధ్య శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర దిగ్విజయంగా సాగింది. నియోజకవర్గ పరిధిలోని జరిగిన పలు అభివృద్ధి పనులను బస్సు యాత్ర ద్వారా నేతలు పరిశీలించి లబ్ధిదారులతో ముచ్చటించారు. స్పీకర్ తమ్మినేని సీతారామ్, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ రీజనల్ కోర్డినేటర్ వై వీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే రెడ్డి శాంతి, జూపూడి ప్రభాకర్ లు హాజరయ్యారు.
పశుసంర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ ప్రజల వద్దకు ప్రజా ప్రతినిధులు వచ్చి సంక్షేమ పాలన చేస్తుంటే ఓర్వలేక శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు లేనిపోని విమర్శలు చేస్తున్నారన్నారని విమర్శించారు. రైల్వే స్టేషన్ లో స్టీల్ కుర్చీలు వేయడం తప్పితే శ్రీకాకుళం జిల్లాకు ఏమి చేసారో చెప్పాలని డిమాండ్ చేశారు. రామ్మోహన్ నాయాడు రాజకీయాలకు గుడ్ బై చెప్పి బ్యూటీ పార్లర్ పెట్టుకోవాలని సలహా ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా యువత వలస పోకుండే ఉండేందుకు సీఎం జగన్ స్థానికంగానే ఉపాధి అవకాశాలు లభించేలా పోర్టు నిర్మాణం చేస్తున్నారని వెల్లడించారు. నేరేడు బ్యారేజ్ పూర్తయితే రైతంగానికి సాగునీరు అందుతుందని భావించి ఒడిశా ముఖ్యమంత్రిని కలసి పరిష్కారానికి కృషి చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఆముదాలవలస గడ్డ- వైఎస్సార్ సీపీ అడ్డా అంటూ అప్పలరాజు ప్రజలతో కలసి నినదించారు.
వినుకొండలో
వినుకొండ నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో జరిగిన సామాజిక సాధికార యాత్రలో రాష్ట్ర మంత్రులు విడదల రజిని, ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున, ఎంపి లావు శ్రీకృష్ణ దేవరాయలు, రాజ్యసభ సభ్యులు పల్నాడు జిల్లా రీజనల్ కో ఆర్డినేటర్ విజయసాయి రెడ్డి, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, ప్రభుత్వ సలహాదారు, సినీ నటుడు అలీ, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.