Tuesday, September 17, 2024
HomeTrending Newsవై నాట్ 175: పులివెందులలో జగన్

వై నాట్ 175: పులివెందులలో జగన్

పులివెందుల బస్ స్టాండ్ నిర్మాణం ఓ వైపు జరుగుతున్నా విపక్ష నేత దీనిపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేశారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరోక్షంగా చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

“ఒకవైపు ఇక్కడ వేగంగా పనులు జరుగుతున్నాయని తెలిసినప్పటికీ కూడా.. ఈ బస్‌ టెర్మినల్‌కి సంబంధించి రకరకాల మాటలు విన్నాం. కొద్ది రోజుల కిందట నేను సోషల్‌ మీడియాలో ఒక మాట విన్నాను. గతంలో ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి పులివెందులలో బస్‌టెర్మినల్‌ కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో మనం ఉన్నామని చెప్పాడు. వేగంగా ఇక్కడ పనులు జరుగుతుంటే.. అవి కనిపిస్తున్నా కూడా ఇటువంటి పెద్ద మనుషులు, వీరికి తోడు ఒక నెగిటివ్‌ మీడియా ఇలాంటి మాటలు చెప్పారు. మన ఖర్మ ఏమిటంటే… ఇవాళ మనం యుద్ధం చేస్తున్నది ఒక తెలుగుదేశం పార్టీతోనే, చంద్రబాబు నాయుడుగారుతోనే కాదు. మనం ఈరోజు ఒక చెడిపోయిన వ్యవస్ధతో యుద్ధం చేస్తున్నాం. ఆ వ్యవస్ధ ఏమిటంటే… ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5.. వీళ్లతో పాటు ఒక దత్తపుత్రుడు” అంటూ దుయ్యబట్టారు. పులివెందులలో నూతనంగా నిర్మించిన బస్ స్టాండ్ ను ప్రారంభించిన అనంతరం అక్కడ జరిగిన సభలో సిఎం ప్రసంగించారు.

ఒక గ్లాసులో మూడు వంతులు నీళ్లుంటే దాన్ని చూపించకుండా నీళ్ళు లేని మిగతా పావలా భాగం చూపించి.. గ్లాసంతా నిండలేదు కాబట్టి అసలు నీళ్లే లేవు అని చూపిస్తున్నారని దుయ్యబట్టారు.  “ఇటువంటి దిగజారిన ఈ వ్యవస్ధలో మీ బిడ్డ ఈ రాష్ట్రంలో ప్రతి కార్యకర్తకు కూడా చెబుతున్నాడు… గతంలో 151 వచ్చాయి. రేపు జరగబోయే ఎన్నికల్లో వై నాట్‌ 175 అని చెప్పి ఈరోజు మీ బిడ్డ పిలుపునిచ్చే పరిస్థితిలో ఉన్నాడు అంటే…దానికి కారణం మీ బిడ్డకు మీరు తోడుగా ఉండి.. రాష్ట్రంవైపు నువ్వు చూడు, ఈ ప్రాంతం మేం చూసుకుంటాం అని మీరు ఇచ్చిన భరోసాయే. అందుకే  ఈ రోజు మీ బిడ్డ ఈ రాష్ట్రం వైపు చూడగలుగుతున్నాడు” అంటూ ప్రజలనుద్దేశించి అన్నారు.

తన పాలనలో 3 లక్షల కోట్ల రూపాయలకు పైగా డీబీటీ, నాన్‌ డీబీటీ ద్వారా అందించామని, రూ.1.71 లక్షల కోట్లు కేవలం బటన్‌ నొక్కి నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశామని వివరించారు. ప్రతి అక్కచెల్లెమ్మల కుటుంబాలకు మంచి జరుగుతుందన్నది ఆలోచన చేయాలని పులివెందుల నుంచి ఇచ్చాపురం వరకూ ప్రతి ఒక్కరినీ కోరుకుంటున్నట్లు సిఎం వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్