Sunday, January 19, 2025
HomeTrending Newsనేడు మూడో విడత ‘జగనన్న తోడు’

నేడు మూడో విడత ‘జగనన్న తోడు’

Jagananna Thodu: చిరు వ్యాపారులకు పది వేల రూపాయల వరకూ వడ్డీ లేని రుణాన్ని అందించి వారికి ఊతమిచ్చేందుకు ఉద్దేశించిన ‘జగనన్న తోడు’ మూడో విడత సాయాన్ని నేడు అందించనున్నారు. నిరుపేదలైన చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ చేతి వృత్తుల వారికి ఒక్కొక్కరికి ఏటా రూ. 10 వేల చొప్పున వడ్డీ లేని రుణం అందించనుంది.

పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ ఒక్కొక్కరికీ రూ. 10 వేల చొప్పున 5,10,462 మంది చిరు వ్యాపారులకు రూ. 510.46 కోట్ల వడ్డీ లేని రుణాలు, రూ. 16.16 కోట్ల వడ్డీ రీఇంబర్స్‌ మెంట్‌ కలిపి మొత్తం రూ. 526.62 కోట్లను నేడు సోమవారం క్యాంప్‌ కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో  సిఎం జగన్ జమచేయనున్నారు.

ఇప్పటివరకు 14,16,091 మంది లబ్ధిదారులకు అందించిన వడ్డీ లేని రుణాలు రూ. 1,416 కోట్లు…లబ్ధిదారుల తరపున బ్యాంకులకు తిరిగి చెల్లించిన వడ్డీ రూ. 32.51 కోట్లు.

  • గ్రామాలు, పట్టణాల్లో సుమారు 5 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పు స్ధలంలో శాశ్వత లేక తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకున్న వారు
  • ఫుట్‌పాత్‌ల మీద, వీధుల్లో తోపుడు బండ్ల మీద వస్తువులు, కూరగాయలు, పండ్లు, ఆహార పదార్ధాలు అమ్ముకుని జీవించే వారు, రోడ్ల పక్కన టిఫిన్‌ సెంటర్లు నిర్వహించేవారు, గంపలు, బుట్టలలో వస్తువులు అమ్మేవారు, సైకిల్, మోటర్‌ సైకిళ్ళు, ఆటోలపై వెళ్ళి వ్యాపారం చేసుకునేవారు
  • చేనేత మరియు సంప్రదాయ చేతివృత్తుల కళాకారులైన ఇత్తడి పని చేసేవారు, బొబ్బలివీణ, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, కలంకారీ, తోలుబొమ్మలు, ఇతర సామాగ్రి తయారీదారులు, లేస్‌ వర్క్స్, కుమ్మరి తదితర వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వ్యక్తుల

ఈ పథకానికి అర్హులు.

అర్హత ఉండి, జాబితాలో పేర్లు నమోదుకానివారు ఎలాంటి ఆందోళనా చెందాల్సిన అవసరం లేదని, గ్రామ, వార్డు వలంటీర్లను సంప్రదించి, సమీప గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలియజేసింది.

Also Read : ఎదుట ఎర్ర జెండా-  వెనక పచ్చ అజెండా:  సిఎం జగన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్