Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్Vivo Pro-Kabaddi: విజేత జైపూర్ పింక్ పాంథర్స్

Vivo Pro-Kabaddi: విజేత జైపూర్ పింక్ పాంథర్స్

జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు ఈ ప్రో-కబడ్డీ సీజన్-9 విజేతగా నిలిచింది. నేడు జరిగిన ఫైనల్లో పునేరి పల్టాన్స్ పై 33-29 తేడాతో విజయం సాధించి రెండోసారి కప్ సొంతం చేసుకుంది.

నరాలు తెగే ఉత్కంఠతో నువ్వా-నేనా అన్నట్లు సాగిన ఈ మ్యాచ్ తొలి అర్ధబాగంలో 14-12తో ఆధిక్యంలో జైపూర్ నిలిచింది. రెండో అర్ధభాగంలో కూడా రెండు జట్లూ హోరా హరీ తలపడ్డాయి, ఇక్కడ కూడా జైపూర్ 19-17 తో పైచేయి సాధించడంతో విజయం జైపూర్ ను వరించింది. జైపూర్ కెప్టెన్ సునీల్ కుమార్, అర్జున్ దేశ్వాల్ లు చెరో ఆరు పాయింట్లతో  సత్తా చాటి విజయంలో కీలక పాత్ర పోషించారు.

తమ జట్టు విజయం సాధించడంతో ఓనర్ అభిషేక్ బచ్చన్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. భార్య, ఐశ్వర్య రాయ్, కుమార్తె ఆద్య కూడా ఈ సంతోషంలో పాలు పంచుకున్నారు. విజయం తర్వాత ఐశ్వర్య రాయ్ కూడా గ్రౌండ్ లోకి వచ్చి తమ జట్టు క్రీడాకారులను అభినందిస్తూ వారితో కలిసి నృత్యం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్