తన నియోజకవర్గంలో ఆత్మహత్య చేసుకున్న 12 మంది రైతుల కుటుంబాలకు ఏడు లక్షల చొప్పున మొత్తం 84 లక్షల రూపాయల పరిహారం అందించామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. పవన్ కళ్యాణ్ లాగా ప్యాకేజీ రాజకీయాలు చేయబోనని స్పష్టం చేశారు. తనపై జనసేన నేతలు చేస్తున్న ప్రచారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన ఆరోపించినట్లు ప్రమాద వశాత్తూ మరణించిన ఓ కుటుంబానికి ప్రభుత్వం అందించిన పరిహారం నుంచి రెండు లక్షల రూపాయలు తీసుకునే దౌర్భాగ్యం ఉంటే రాజకీయాలను తృణప్రాయంగా వదిలిపెడతానని ఛాలెంజ్ చేశారు.
ఆగస్టు 20న బాధితులు ఇద్దరికి సిఎం రిలీఫ్ ఫండ్ నుంచి సాయం అందేలా చేశానని, దీనిపై చంద్రబాబు జేబు పార్టీ వారు ఏదో ఆరోపణలు చేస్తే ఊరుకుంటానా అంటూ ప్రశ్నించారు. తనపై ఆ పార్టీ నేతలు సోషల్ మీడియాలో ఉద్దేశ పూర్వకంగా ట్రోల్ చేస్తున్నారని మండిపడ్డారు. జనసేన అభిమాని చనిపోతే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించలేని కుసంస్కారం పవాన్ కళ్యాణ్ దేనని అంబటి విమర్శించారు.
Also Read : డొంక తిరుగుడు ఎందుకు?: అంబటి ప్రశ్న