Friday, January 24, 2025
HomeTrending NewsJanagama: జనగామలో విషాదం.. ఎస్.ఐ ఆత్మహత్య

Janagama: జనగామలో విషాదం.. ఎస్.ఐ ఆత్మహత్య

జనగామ జిల్లాలో ఎస్సై దంపతుల ఆత్మహత్య కలకలం రేపింది. ముందు ఎస్సై భార్య ఆత్మహత్య చేసుకోగా.. ఆమె మృతిని తట్టుకోలేక ఆయన సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. కాసర్ల శ్రీనివాస్‌ జనగామ పట్టణంలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నాడు. భార్య స్వరూపతో కలిసి వెంకన్నకుంటలో నివాసం ఉంటున్నాడు. ఏమైందో తెలియదు గానీ గురువారం తెల్లవారుజామున ఎస్సై శ్రీనివాస్‌ భార్య స్వరూప బాత్రూంలోకి వెళ్లి ఉరివేసుకుంది. ఉదయం నిద్రలేచిన తర్వాత బాత్‌రూంకి వెళ్లిన శ్రీనివాస్‌కు.. కిటికీ ఊచలకు వేలాడుతున్న భార్య మృతదేహం కనిపించింది. అది చూసి కన్నీరుమున్నీరుగా విలపించాడు.

ఈ విషయం తెలియగానే ఎస్సై శ్రీనివాస్‌ బంధువులు, స్నేహితులు ఇంటికి వచ్చి పరామర్శించారు. జనగామ ఏసీపీ, సీఐ కూడా ఎస్సై ఇంటికి వచ్చి ఓదార్చారు. కానీ ఆయన తన దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. భార్య మరణంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. అప్పటి దాకా ఏడుస్తూ ఉన్న ఎస్సై శ్రీనివాస్‌ కాసేపటికి వాష్‌రూంకి అని వెళ్లాడు. అక్కడే సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకున్నాడు.

అయితే బుధవారం రాత్రి సమయంలో శ్రీనివాస్‌కు, అతని భార్యకు కలహాలు జరిగినట్లు తెలుస్తోంది. దీంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎస్సై దంపతుల మృతదేహాలను జనగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్