Sunday, January 19, 2025
Homeసినిమాఎన్టీఆర్ కు జోడీగా జాన్వీ ఫిక్స్

ఎన్టీఆర్ కు జోడీగా జాన్వీ ఫిక్స్

జాన్వీ కపూర్ టాలీవుడ్ ఆరంగ్రేటం ఖరారైంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ రూపొందిస్తోన్న ‘#ఎన్టీఆర్30’ సినిమాలో ఆమె హీరోయిన్ గా నటిస్తోంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ  ఎన్టీఆర్ ఆర్ట్స్ ట్విట్టర్ లో ప్రకటించింది. ఈ సినిమాకు సంబంధించి ఓ అప్ డేట్ రేపు ఇస్తామని నిన్న కొరటాల శివ ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే జాన్వీ టాలీవుడ్ ఎంట్రీపై రెండేళ్లుగా చర్చ జరుగుతూనే ఉంది. రామ్ చరణ్ సరసన శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో ఆమెను అనుకున్నా అది కుదరలేదు, ఆ తర్వాత బుచ్చిబాబు-చరణ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో అని కూడా ప్రచారం జరిగింది.  విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ మొదలు పెట్టిన జనగణమనలో కూడా ఈ భామను మొదట అనుకున్నారు. ‘మిలీ’సినిమా  ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా టాలీవుడ్ లో నటించేందుకు తాను ఎంతో ఆసక్తిగా ఉన్నానని జాన్వీ చెప్పింది.  మహేష్, ప్రభాస్, చరణ్, బన్నీ ఇలా హీరోల కొత్త సినిమాల వార్తలు బైటకు వచ్చినప్పుడల్లా జాన్వీ పేరు కూడా ప్రచారంలోకి వచ్చేది. చివరకు ఎన్టీఆర్ సినిమాతో అది కార్యరూపం దాల్చుతోంది.

తాత పెద్ద ఎన్టీఆర్ తో శ్రీదేవి ఎన్నో సినిమాల్లో నటించారు, అవన్నీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ లుగా నిలిచాయి, ఇప్పుడు మనవడు యంగ్ టైగర్ తో శ్రీదేవి కూతురు జాన్వీ నటిస్తోన్న ఈ సినిమా కూడా తెలుగులో మరోబ్లాక్ బస్టర్ అవుతుందని సినీ ప్రేక్షకులు ఆశిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్