Saturday, January 18, 2025
HomeTrending Newsచైనా దుష్ట పన్నాగంతో తైవాన్ జలసంధిలో ఉద్రిక్తత   

చైనా దుష్ట పన్నాగంతో తైవాన్ జలసంధిలో ఉద్రిక్తత   

తైవాన్ జలసంధిలో ఉద్రిక్తతలు శాంతికి భంగం కలిగించే విధంగా ఉన్నాయని జపాన్ ఆందోళన వ్యక్తం చేసింది. శాంతి, సుస్థిరతలకు విఘాతం వాటిల్లితే పరిణామాలు తీవ్రంగా ఉండే ప్రమాదం ఉందని పరోక్షంగా చైనాను హెచ్చరించింది.  ఆసియన్ (ASEAN) దేశాల సమావేశంలో పాల్గొన్న జపాన్ విదేశాంగ మంత్రి నోబు కిషి – వివాదంతో సంబంధం ఉన్న రెండు వర్గాలు ముఖాముఖీ చర్చలు జరిపితేనే పరిష్కారం లభిస్తుందని స్పష్టం చేశారు.

కరోన వైరస్ నేపథ్యంలో అసోసియేషన్  అఫ్ సౌత్ఈస్ట్ ఆసియన్ నేషన్స్ (ASEAN) రక్షణ,విదేశాంగ మంత్రుల సమావేశం ఆన్లైన్ లో నిర్వహించారు. ఈ సమావేశంలో సభ్య దేశాలతో పాటు అమెరికా కుడా పాల్గొంది. అంతర్జాతీయ జలాల్లో విదేశీ నౌకల తనికి పేరుతో చైనా తమ నావిక దళాలను పంపటం వల్లే జలసంధిలో ఉద్రిక్తత ఏర్పడిందని జపాన్ విమర్శించింది. అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు అనుగుణంగా నడుచుకుంటే ఎలాంటి అపోహలకు అవకాశం లేదని పరోక్షంగా చైనాకు జపాన్ చురక అంటించింది.

ప్రపంచంలోనే అత్యధికంగా సైనిక బలగాల్ని మోహరించిన ప్రాంతంగా తైవాన్ జలసంధి ప్రాచుర్యంలో ఉంది. 180 కిలోమీటర్ల పొడవైన ఈ జలసంధి తైవాన్ దివుల్ని ఆసియా ఖండం నుంచి వేరు చేస్తుంది. ఈ ప్రాంతం అంతర్జాతీయ జలాల్లో ఉన్నా చైనా,తైవాన్ బలగాల పహారాతో ఏ క్షణంలో ఎం జరుగుతుందో అన్నట్టుగా ఉంటుంది.

తైవాన్ తమ దేశంలో అంతర్భాగం అని చైనా వాదించటం ఈ ప్రాంతంలో సమస్యలకు దారితీసింది. దక్షిణ చైనా సముద్రంపై తమకే హక్కు ఉందని ఒంటెత్తు పోకడలకు పోవడం, పొరుగు దేశాలతో గొడవలకు దిగటం చైనాకు అలవాటుగా మారింది. చైనా మొండి వైఖరితో తైవాన్ తో పాటు బ్రూనై, మలేసియా, పిలిప్పిన్స్ దేశాలతో భూవివాదాలు ఉన్నాయి.

విశాలమైన దక్షిణ చైనా సముద్రంపై చైనాకు ఎలాంటి హక్కు లేదని 2016 లో అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు వెలువరించినా  బీజింగ్ పాలకులు తమ అకృత్యాలు మానటం లేదు.  చైనా దుష్ట పన్నాగాలను ఎదుర్కొని తైవాన్ దేశానికి అండగా నిలిచేందుకు అమెరికా  తన బలగాలను ఈ ప్రాంతంలో మోహరించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్