Monday, November 25, 2024
HomeTrending NewsAP CS: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.ఎస్‌.జవహర్‌రెడ్డి

AP CS: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.ఎస్‌.జవహర్‌రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కె.ఎస్‌.జవహర్‌రెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ రేపు (నవంబర్ 30న) పదవీవిరమణ చేస్తున్నారు.   డిసెంబరు 1 నుంచి కొత్త ప్రధానకార్యదర్శిగా జవహర్‌రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తారు. 2024 జూన్‌ వరకు ఆయనకు సర్వీసు ఉంది.

సీఎస్‌గా రేపు పదవీవిరమణ  చేస్తున్న  సమీర్‌శర్మను రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (ఏపీ పీసీబీ) ఛైర్మన్‌గా నియమించింది. దీనితో పాటు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లీడర్‌షిప్‌, ఎక్స్‌లెన్స్‌ అండ్‌ గవర్నెన్స్‌ (ఐఎల్‌ఈ అండ్‌ జీ) వైస్‌ఛైర్మన్‌ పోస్టులోనూ ఆయనను ఇన్‌ఛార్జిగా నియమించనున్నట్టు సమాచారం.

కొత్త సీఎస్‌గా నియమితులైన జవహర్‌రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయన 1990 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. ఆయన కంటే సీనియర్లయిన నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ (1987), పూనం మాలకొండయ్య (1988), కరికాల్‌ వలెవన్‌ (1989) సీఎస్‌ పోస్టును ఆశించినా ముఖ్యమంత్రి జగన్‌ మాత్రం… జవహర్‌రెడ్డివైపే మొగ్గు చూపారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ జవహర్‌రెడ్డికి ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆయన కోరిక మేరకే… తితిదే ఈవోగా నియమించారు. ఆ పోస్టులో కొనసాగిస్తూనే, సీఎంఓకి తీసుకొచ్చారు. కొన్ని నెలలపాటు ఆయన రెండు బాధ్యతల్నీ నిర్వహించారు. ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధానకార్యదర్శిగా ప్రస్తుతం సీఎంఓ వ్యవహారాలన్నీ ఆయన కనుసన్నల్లోనే సాగుతున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్