Saturday, January 18, 2025
Homeఅంతర్జాతీయంఫ్లాయిడ్ కుటుంబానికి వైట్ హౌస్ ఆతిధ్యం

ఫ్లాయిడ్ కుటుంబానికి వైట్ హౌస్ ఆతిధ్యం

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ మంగళవారం జార్జ్ ప్లాయిడ్ కుటుంబానికి వైట్ హౌస్ లో ఆతిధ్యం ఇవ్వనున్నారు. జార్జ్ ప్లాయిడ్ మొదటి వర్ధంతి సందర్భంగా ఈ ఆతిధ్యం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

గత ఏడాది మే 25న మినియాపోలీస్ లో ఆఫ్రికా-అమెరికన్ జార్జ్ ప్లాయిడ్ ను నకిలీ నోట్ల కేసులో అరెస్టు చేసే క్రమంలో పోలీసు అధికారి డెరెక్ చౌవిన్ అతని పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. జార్జ్ మెడపై మోకాలు వుంచి నొక్కి పెట్టాడు. 9 నిమిషాల పాటు అలాగే ఉంచడంతో ఊపిరాడక ఫ్లాయిడ్ మరణించాడు.

ఈ మృతిపై యావత్ అమెరికా భగ్గుమంది. జాతి వివక్షతోనే ఫ్లాయిడ్ ను చంపేశారంటూ ఆందోళనకారులు ఆరోపించారు. నాటి డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వాన్ని నిరసనలు కుదిపివేశాయి. ఫ్లాయిడ్ చివరి సారిగా మాట్లాడిన ‘ ఐ కెన్నాట్ బ్రీత్’ అనే పేరుతో మొదలైన ఈ ఉద్యమానికి ప్రపంచంలోని ఎన్నో దేశాలు మద్దతు తెలిపాయి. డెరెక్ ను వెంటనే సస్పెండ్ చేసిన అధికార యంత్రాంగం ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. ఈ సంఘటనను విచారించిన కోర్టు డెరెక్ ను దోషిగా తీర్పు చెప్పింది. నిందితులుగా ఉన్న మరో ముగ్గురు పోలీసు అధికారులపై ఆగస్టులో విచారణ జరగనుంది.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎన్నకల ప్రచార సందర్భంగా పలుసార్లు ఈ ఉదంతాన్ని ప్రస్తావించారు. ఎనికల్లో గెలిచిన బైడెన్ ప్రమాణ స్వీకారానికంటే ముందు ఓ సందర్భంలో ఫ్లాయిడ్ కుమార్తె కుమార్తె ముందు మోకరిల్లి తన క్షమాపణలు కోరారు.

ఫ్లాయిడ్ పేరుతో ‘జార్జ్ ఫ్లాయిడ్ జస్టిస్ ఇన్ పోలీసింగ్ యాక్ట్’ పేరుతో ఓ బిల్లును తీసుకురావాలని బిడెన్ నిర్ణయించారు కాని అది పెండింగ్ లో ఉంది. ఫ్లాయిడ్ మరణించి మే 25 నాటికి సంవత్సరం పూర్తవుతున్నందున ఆ కుటుంబాన్ని కలవబోతున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్