పవన్ కళ్యాణ్ నిజంగా ప్యాకేజ్ కళ్యాణ్ అని రాష్ట్ర నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అభివర్ణించారు. ప్యాకేజీ అంటే చెప్పుతో కొడతానని పవన్ అంటున్నారని, కనీసం ఆ చెప్పు అయినా ఆయనే కొనుక్కున్నాడా లేక అయన యాజమాని కొనిచ్చాడా అని ప్రశ్నించారు. మాకు చెప్పులు లేవా… అయినా నిన్ను గత ఎన్నికల్లో రెండు చోట్లా ప్రజలు చెప్పులతో కొట్టలేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్, తమ పార్టీ నేతలపై పవన్ నేడు మాట్లాడిన భాష అత్యంత హేయంగా ఉందన్నారు.
నా కొడుకులు అంటున్నారని, మేము మాట్లాడలేమా అని జోగి ఫైర్ అయ్యారు. పవన్ ఓ పిచ్చి కుక్క అని సంవత్సరం క్రితమే తాను చెప్పానన్నారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలూ సమగ్రంగా, సమానంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో మా నాయకుడు సిఎం జగన్ పరిపాలనా వికేంద్రీకరణకు నిర్ణయం తీసుకుంటే అడ్డుపడుతున్నారని ఆరోపించారు.
చంద్రబాబు- పవన్ ల మధ్య ఉన్న ముగుసు నేటితో తోలిగిపోయిందని, నోవాటేల్ హోటల్ లో ఇద్దరూ కలుసుకుని తాము ఎప్పటి నుంచో చెబుతున్న విషయాన్ని రుజువు చేశారని జోగి వ్యాఖ్యానించారు. ఒక్కో ఎన్నికలకు ఒక్కో పార్టీతో కలిసి వెళ్ళడం ఆ రెండు పార్టీలకూ అలవాటుగా మారిందన్నారు. సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో నిలిచిన జగన్ ను ఓడించాలన్నదే ఈ రెండు పార్టీల తపన అని విమర్శించారు. కొంతమంది గూండాలను తయారు చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు వారు ప్రయతిస్తున్నారని దుయ్యబట్టారు. పవన్ సైకో లను రెచ్చగొట్టి పోతారని, కానీ వారిని మోసం చేసి వెళుతున్నారని జోగి అన్నారు.
ప్యాకేజ్ అంటే పవన్ కు కోపం వస్తుందని, కానీ ఆయన మాట్లాడిన మంగళగిరి ఆఫీసు అసలు ఆయనదేనా, ప్యాకేజ్ లో భాగంగా వచ్చింది కాదా అని నిలదీశారు.
Also Read : వెధవల్లారా…: వైసీపీ నేతలపై పవన్ నిప్పులు