Saturday, November 23, 2024
HomeTrending Newsఆయన ఆఖరి కోరిక కూడా తీర్చలేదే? జోగి ప్రశ్న

ఆయన ఆఖరి కోరిక కూడా తీర్చలేదే? జోగి ప్రశ్న

చంద్రబాబు నాడు ఎన్టీఆర్ ను గద్దె దించి సిఎం కుర్చీలో కూర్చున్నప్పుడు బాలకృష్ణ మందహాసం చేశారని, ఆయన ఇప్పుడు శునకం అంటూ మాట్లాడడం విచిత్రంగా ఉందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యానించారు. హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుకు సంబంధించి బాలకృష్ణ చేసిన ట్వీట్ పై జోగి ఘాటుగా స్పందించారు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీ గుర్తును, ట్రస్టును, అకౌంట్లను లాక్కొని ఆ పీఠంపై చంద్రబాబును మీరంతా కలిసి స్వయంగా కూర్చో బెట్టిన విషయం మర్చిపోయావా,  ఆ పీఠంపై శునకాన్ని కూర్చోబెట్టిన తోకవు నువ్వు కాదా అని ప్రశ్నించారు.  వెన్నుపోటు పొడిచిన బాబు వెంట నడిచిన వ్యక్తివి నువ్వు కాదా అని నిలదీశారు.  నిజంగా తన కడుపున పుట్టి ఉంటే బాబుపై తిరుగుబాటు చేసి రావాలన్న మీ తండ్రి ఆఖరి కోరిక కూడా తీర్చలేని చవటలు, దద్దమ్మలు ఆయన కుమారులైన మీరు కాదా అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ  కేంద్ర కార్యాలయంలో జోగి మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టును ట్వీట్ చేయడం కాదని, గతం మర్చి పోకూడదని  జోగి సలహా ఇచ్చారు.  ఎన్టీఆర్ పేరు చరిత్రలో నిలపాలంటే ఏమి చేయాలనే ఆలోచన మీ మదిలో ఎప్పుడైనా మెదిలిందో లేదో ఆలోచించుకోవాలన్నారు. కానీ అయన పేరు చెక్కు చెదరకుండా ఉండేందుకు ఓ జిల్లాను అయన పేరిట ఏర్పాటు చేసిన ఘనత సిఎం వైఎస్ జగన్ కే దక్కుతుందని వెల్లడించారు. బాలకృష్ణకు చిత్తశుద్ధి ఉంటే ఆయనకు జన్మనిచ్చిన ఎన్టీఆర్ తో పాటు పునర్జన్మ ఇచ్చిన డా. వైఎస్సార్ కు కూడా రుణపడి ఉండాలన్నారు. ఒకప్పుడు నారా కేరాఫ్ నందమూరిగా ఉండేదని…. ఇప్పుడు నందమూరి కుటుంబం నారా కు కేరాఫ్ గా మారిందని ఎద్దేవా చేశారు.

వైఎస్ షర్మిల అసెంబ్లీ లో సిఎం జగన్ ప్రసంగం విని ఉండకపోవచ్చని అందుకే పేరు మార్పు విషయంలో అలా స్పందించి ఉంటారని జోగి అభిప్రాయపడ్డారు. వైద్య ఆరోగ్య రంగానికి డా. వైఎస్ చేసిన సేవలు దేశవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయని అన్నారు.

Also Read : తస్మాత్ జాగ్రత్త: బాలయ్య హెచ్చరిక

RELATED ARTICLES

Most Popular

న్యూస్