Saturday, November 23, 2024
HomeTrending Newsవిపక్షాల ఉద్యమ కార్యాచరణ

విపక్షాల ఉద్యమ కార్యాచరణ

జాతీయ స్థాయిలో బీజేపీ యేతర పక్షాలు, రాష్ట్ర స్థాయిలో టిఆర్ఎస్ యేతర పక్షాలతో ఉద్యమ కార్యాచరణ రూపొందించామని టిపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రకటించారు. భూమి సమస్యలు, భూ సేకరణ సమస్యలు,  ధరణి వెబ్సైట్ సమస్యలపై పోరాటం చెయ్యాలని నిర్ణయించామన్నారు. హైదరాబాద్లో ఈ రోజు జరిగిన సమావేశంలో సీపీఎం నుంచి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ ఎంఎల్ నుంచి రంగారావు, చెరుకు సుధాకర్ ఇంటిపార్టీ, గోవర్ధన్ న్యూ డెమోక్రసీ నుంచి మధు యాష్కీ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్, మల్లు రవి, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు పాల్గొన్నారు.

తెరాస రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 22వ తేదీన ఇందిరా పార్కు వద్ద మహా ధర్నాలో రైతులను, బాధితులను సమీకరించి, పెద్దఎత్తున విజయవంతం చేయాలని నిర్ణయించారు. ఈ నెల 27న భారత్ బంద్ కు సంబంధించి పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా కమిటీలు వేసుకొని సన్నాహక సమావేశాలు పెట్టి, బంద్ విజయవంతం చేసేందుకు కృషి చేయాలి.

పోడు భూముల సమస్యలపై ప్రతిపక్ష పార్టీలు పోరాటం అనగానే కేసీఆర్ కు భయం పట్టుకుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమరిశించారు. అందుకే పోడు భూములపై కమిటీ వేస్తున్నట్టు ప్రకటించారన్నారు. కమిటీలతో, కంటి తుడుపు చర్యలతో ఊరుకొమని వీరభద్రం చెప్పారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటం కోనసాగుతుందన్నారు.

కేసీఆర్, మోడీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం ఉంటుందని, తెలంగాణలో ఉద్యమ కార్యాచరణ చేశామని సిపిఐ  రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. 19 రాజకీయ పక్షాలు సోనియాగాంధీ నేతృత్వంలో రూపొందించిన పోరాటాల ప్రణాళిక ప్రకారం ఇక్కడ బీజేపీ, టిఆర్ఎస్ ప్రభుత్వాల పనితీరుపై పోరాటం చేస్తామని చాడ వెంకట్ రెడ్డి వెల్లడించారు.ప్రజా పోరాటాల్లో సీపీఐ కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొంటారని తెలిపారు.

బీజేపీ, టిఆర్ఎస్ ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై విపక్షాలు ఏకతాటి మీదకు రావటం శుభపరిణామం అని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ఈ నెల 22వ తేదిన మహా ధర్నా, 27న భారత్ బంద్, 30న జిల్లా కలెక్టర్ లకు వినతి పత్రాలు, అక్టోబర్ 5వ తేదిన పోడు రాస్తారోఖో పోరాటాలు విజయవంతం చెయ్యాలని కోదండరాం పిలుపు ఇచ్చ్హారు. అటవీ హక్కుల చట్టం, పోడు రైతుల సమస్యల పరిష్కారం అంశాలపై పోరాటం ఉంటుందని, ఆదిలాబాద్ నుంచి అశ్వరావు పేట వరకు పోడు రాస్తారోఖో నిర్వహిస్తామని కోదండరాం తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్