Sunday, January 19, 2025
Homeసినిమా#NTRNEEL: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కిక్ ఇచ్చే న్యూస్

#NTRNEEL: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కిక్ ఇచ్చే న్యూస్

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బాలీవుడ్ లోనే కాదు.. హాలీవుడ్ లో కూడా గుర్తింపు సంపాదించుకోవడంతో క్రేజ్ కు తగ్గట్టుగా భారీ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం దేవర సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కొరటాల శివ డైరెక్షన్ లో రూపొందుతోన్న దేవర చిత్రాన్ని రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించి మూవీ పై మరింత క్రేజ్ పెంచారు. ఏప్రిల్ 5న దేవర చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఇప్పుడు యంగ్ టైగర్ ఫ్యాన్స్ కి మాంచి కిక్ ఇచ్చే న్యూస్ ఇచ్చారు మైత్రీ మూవీ మేకర్స్.

ఇంతకీ విషయం ఏంటంటే.. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఓ భారీ పాన్ ఇండియా మూవీ చేయనున్నట్టుగా మైత్రీ మూవీ మేకర్స్ గతంలో ప్రకటించారు. అయితే.. ఎన్టీఆర్ దేవర తర్వాత బాలీవుడ్ మూవీ ‘వార్ 2’ చేయనున్నారు. నిన్న దేవర 2 ఉంటుందని అనౌన్స్ చేశారు. ప్రశాంత్ నీల్ సలార్ 2 చేయాలి, ఎన్టీర్ దేవర 2 చేయాలి ఇదంతా జరగడానికి టైమ్ పడుతుంది కాబట్టి ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ మూవీ ఇప్పట్లో ఉండదేమో అనే ప్రచారం మొదలైంది.

ప్రచారంలో ఉన్న పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టేలా మైత్రీ సంస్థ అనౌన్స్ మెంట్ ఇచ్చింది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో మూవీని 2024లో ఏప్రిల్ లో నిర్మించనున్నట్టుగా ప్రకటించారు. ఇండియన్ సినిమాలోనే న్యూ బెంచ్ మార్క్ క్రియేట్ చేసేలా ఈ సినిమా ఉంటుందని తెలియచేశారు. దీంతో ఈ భారీ, క్రేజీ ప్రాజెక్ట్ పై ఇప్పటి నుంచో భారీ అంచనాలు ఉన్నాయి. మొత్తానికి ఎన్టీఆర్ తన క్రేజ్ కు తగ్గట్టుగా భారీ, క్రేజీ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకెళుతున్నాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్