Sunday, February 23, 2025
Homeసినిమాఆగస్ట్ 15న ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’

ఆగస్ట్ 15న ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. బిగ్ బాస్ సీజన్ 1కు హోస్ట్ గా ఎంట్రీ ఇచ్చి బుల్లితెర పై అదరగొట్టేశాడు. ఎన్టీఆర్ తనదైన స్టైల్ లో వ్యాఖ్యాతగా వ్యవహరించి అందర్నీ ఆకట్టుకున్నారు. ఈ షో తర్వాత ఎన్టీఆర్ సినిమాల్లో బిజీగా ఉండడం వలన మళ్లీ బుల్లితెర పై కనిపించలేదు. ఇప్పుడు ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అంటూ బుల్లితెర పై మరోసారి సందడి చేయడానికి రాబోతున్నారు. జెమిని టీవీలో ఈ రియాల్టీ షో ప్రసారం కానుంది. ఆమధ్య ఈ షోకు సంబంధించి ప్రొమో రిలీజ్ చేశారు కానీ.. ఎప్పుడు ఈ షో ప్రారంభం అనేది ప్రకటించలేదు.

తాజా సమాచారం ప్రకారం.. ఎవరు మీలో కోటీశ్వరులు షో స్వాతంత్య్ర‌ దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న మొదలు కానుందని తెలిసింది. ఫస్ట్ ఎపిసోడ్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ గా రాబోతున్నారని.. ఆల్రెడీ ఈ ఎపిసోడ్ కు సంబంధించి షూటింగ్ కూడా పూర్తయ్యిందని వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ మళ్లీ బుల్లితెర పైకి రాబోతున్నారని తెలిసినప్పటి నుంచి అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ షో స్టార్ట్ అవుతుందా..? అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆగష్టు 15న గ్రాండ్ గా ఈ షోను స్టార్ట్ చేయనున్నారు. మరి.. ఈ షోను బుల్లితెర పై ఎన్టీఆర్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్