వచ్చే వేసవిలో పెరగనున్న గరిష్ట డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్ సరఫరా ఉండాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రబీకి నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం మింట్ కాంపౌండ్ లోని తన కార్యాలయంలో ట్రన్స్కో&జెన్కో సి యం డి దేవులపల్లి ప్రభాకర్ రావు,టి యస్ యస్ పి డి సి యల్ సి యం డి రఘుమారెడ్డి లతో మంత్రి జగదీష్ రెడ్డి ప్రత్యేకంగా సమీక్షా సమావేశం నిర్వహించారు.
తెలంగాణ ఆవిర్భావం నుండి రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్ నమోదు అవుతుందని ఆయన తెలిపారు. రబీ సీజన్ లో ఉమ్మడి రాష్ట్రంలో 6,666 మేఘావాట్లు ఉన్న డిమాండ్ ఒక్క తెలంగాణలోనే 14,160 మెఘవాట్లకు చేరడమే ఇందుకు నిదర్శనమన్నారు. ముందెన్నడూ లేని రీతిలో డిసెంబర్ నెలలో సైతం విద్యుత్ డిమాండ్ 14,017 మెఘవాట్లుగా నమోదు అయిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
విద్యుత్ డిమాండ్ ఎంత పెరిగినా నిరంతర విద్యుత్ సరఫరాలో డిమాండ్ కు అనుగుణంగా సరఫరా జరుగుతుందన్నారు. ఈ డిమాండ్ ఈ వేసవికాలంలో 15,500 మెఘవాట్లకు పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు సమీక్ష సమావేశంలో మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అందుకు తగిన రీతిలో చర్యలు తీసుకోవాలని సి యం డి లకు ఆయన ఆదేశించారు. రాష్ట్రంలో నానాటికి పెరుగుతున్న పారిశ్రామికాభివృద్దికి తోడు పెరుగుతున్న గృహావినియోగ దారుల వినియం,వ్యవసాయ రంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్ సరఫరాలతో ఈ డిమాండ్ పెరిగి 15,500 మెఘవాట్లను మించి పోతుందన్నారు. అదే విదంగా టి యస్ యస్ పి డి సి యల్ లో ఖాళీగా ఉన్న 1553 జూనియర్ లైన్ మెన్ లతో పాటు 48 అసిస్టెంట్ ఇంజినీర్ ఉద్యోగాలు భర్తీకి మంత్రి జగదీష్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం టి యస్ యస్ పి డి సి యల్ లో మొత్తం 1601 ఉద్యోగాల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్ జారీ చేయాలంటూ మంత్రి జగదీష్ రెడ్డి టి యస్ యస్ పి డి సి ఎల్ సి యం డి రఘుమారెడ్డి ని ఆదేశించారు.
Also Read : కాంగ్రెస్,బిజెపిల ఎలుబడిలో అంధకారమే – జగదీష్ రెడ్డి