Saturday, January 18, 2025
Homeసినిమాపార్వతీదేవిగా కాజల్?

పార్వతీదేవిగా కాజల్?

‘కన్నప్ప’ సినిమాకి సంబంధించి రోజుకో విషయాన్ని గురించి అంతా మాట్లాడుకునేలా టీమ్ శ్రద్ధ  తీసుకుంటోంది. కొన్ని రోజులుగా రోజుకో అప్ డేట్ ఉండేలా చూస్తున్నారు. దాంతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ‘కన్నప్ప’ కబుర్లు నానుతూనే ఉన్నాయి. ఆ క్రమంలోనే ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం కాజల్ ను ఎంపిక చేశారనే వార్త బలంగా వినిపిస్తోంది. దాదాపు అది పార్వతీదేవి పాత్రనే అని అంటున్నారు. నిన్నటి నుంచే కాజల్ పేరు తెరపైకి వచ్చింది.

మంచు విష్ణు టైటిల్ రోల్ ను పోషిస్తున్న ఈ సినిమాలో, పరమశివుడిగా ప్రభాస్ కనిపించనున్నాడనే టాక్ వచ్చింది. కానీ ఆ పాత్ర అక్షయ్ కుమార్ వెళ్లగా .. ప్రభాస్ నందీశ్వరుడిగా కనిపించనున్నాడని అంటున్నారు. ఇక పార్వతీదేవి పాత్ర కోసం నయనతార .. అనుష్క పేర్లు వినిపిస్తూ వచ్చాయి. ఆ పాత్రకి గాను కాజల్ ను తీసుకున్నారనే మాట నిన్నటి నుంచి వినిపిస్తోంది. అయితే నయనతార – అనుష్క వేరే పాత్రలలో కనిపించనున్నారా? లేదంటే అది రూమర్ గానే నిలిచిపోతుందా? అనే విషయంలో క్లారిటీ రావలసి ఉంది.

ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణను చాలా వరకూ న్యూజిలాండ్ లో ప్లాన్ చేశారు. అక్కడికి సంబంధించిన చిత్రీకరణను దాదాపు పూర్తిచేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో శివపార్వతులకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. అంటే కథలో భాగంగా ఇవి కైలాసానికి సంబంధించిన దృశ్యాలుగా తెరపైకి వస్తాయన్న మాట. ఆల్రెడీ మొన్ననే ఈ సెట్లో అక్షయ్ కుమార్ అడుగుపెట్టాడు. ఇక రేపో మాపో కాజల్ కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్