Saturday, January 18, 2025
Homeసినిమాఫిబ్రవరి 14న ‘సర్కారు వారి పాట’ ఫస్ట్ సింగిల్ ‘కళావతి’ విడుద‌ల‌

ఫిబ్రవరి 14న ‘సర్కారు వారి పాట’ ఫస్ట్ సింగిల్ ‘కళావతి’ విడుద‌ల‌

Kalavathi coming: సూపర్ స్టార్ మహేష్ బాబు యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ పరుశురామ్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజాగా మేకర్లు ఈ మూవీని మే 12న విడుదల చేయబోతోన్నట్టు ప్రకటించారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి మొదటి పాటను విడుదల చేయబోతోన్నారు. సినిమాలో కీర్తి సురేష్ పాత్ర పేరు కళావతి. ఆ పాత్ర పేరు మీదుగా ఫస్ట్ సింగిల్ ఉండబోతోందని పోస్టర్‌ను బట్టి తెలుస్తోంది.

ఇది ఖ‌చ్చితంగా మెలోడీ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలవనుందని చిత్ర యూనిట్ తెలిపింది. తమన్ స్వరపరిచిన ఈ పాటతో అందరూ ప్రేమలో పడనున్నారు. మహేష్ బాబును సరికొత్త అవతారంలో చూపించబోతోన్నారు దర్శకులు పరుశురాం. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌ల మీద నవీన్ యెర్నేని, వై రవి శంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్ మధి సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరిస్తున్నారు. మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్‌గా, ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్