Saturday, January 18, 2025
Homeసినిమాఅన్న‌య్య త‌ప్ప మరొకరు చేయలేరు: ఎన్టీఆర్

అన్న‌య్య త‌ప్ప మరొకరు చేయలేరు: ఎన్టీఆర్

నందమూరి కళ్యాణ్ రామ్ న‌టించిన‌ లేటెస్ట్ మూవీ బింబిసార. ఈ చిత్రాన్ని నూత‌న ద‌ర్శ‌కుడు వ‌శిష్ట్ రూపొందించారు. ఆగష్టు 5 న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. త్రిగర్తల రాజు బింబిసారుడిగా కళ్యాణ్ రామ్ నటించిన ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కె హరికృష్ణ నిర్మించారు. ఎంతో భారీ వ్యయంతో అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కిన బింబిసార మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్ మూవీ పై విపరీతంగా అంచనాలు పెంచేసాయి.

ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని  హైదరాబాద్ లో ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్వహించారు. ఇక ఈ వేడుకకి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. అన్నయ్య కళ్యాణ్ రామ్ తనకు స్టోరీ మొత్తం చెప్పారని అన్నారు. అయితే వశిష్ట కొత్త దర్శకడు కావడంతో ఇంత భారీ స్క్రిప్ట్ ని ఎలా హ్యాండిల్ చేయగలడు అనే అనుమానం వచ్చిందని, కాగా ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి అయిన తరువాత తనకు ప్రత్యేకంగా మూవీ ప్రివ్యూ వేసి చూపించిన తరువాత నిజంగా ఎంతో ఆశ్చర్యం కలిగిందని అన్నారు.

వశిష్ఠ తాను చెప్పిన స్టోరీని అంతకు మించి అద్భుతంగా స్క్రీన్ పైన చూపించారని, ప్రతి సీన్ సూపర్ గా ఉందని, మరీ ముఖ్యంగా కథ, కథనాలతో పాటు గ్రాండియర్ విజువల్స్, ఫోటోగ్రఫీ, అలానే చిరంతన్ భట్ సాంగ్స్ తో పాటు కీరవాణి గారు అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ మూవీకి పెద్ద బలం అన్నారు ఎన్టీఆర్. ఇక ఈ మూవీలో బింబిసారుడి పాత్రని కేవలం అన్నయ్య కళ్యాణ్ రామ్ మాత్రమే పోషించగలరని, ఆ పాత్ర కోసం ఆయన తన శరీరాన్ని మలుచుకున్న తీరు, అలానే నటించిన తీరు సూపర్ అన్నారు ఎన్టీఆర్. ఈ మూవీ తప్పకుండా మంచి సక్సెస్ అందుకుని హీరోగా అన్నయ్య కళ్యాణ్ రామ్ కెరీర్ కి పెద్ద బ్రేక్ ని అందిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఎన్టీఆర్.

Also Read ఆ వార్తలు నిజం కాదు: కళ్యాణ్ రామ్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్