Saturday, January 18, 2025
Homeసినిమాధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ లో శివరాజ్ కుమార్

ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ లో శివరాజ్ కుమార్

నేషనల్ అవార్డ్ విన్నర్, సూపర్ స్టార్ ధనుష్ భారీ పీరియాడికల్ మూవీ “కెప్టెన్ మిల్లర్”. 1930 – 40ల నేపధ్యంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కతున్న ఈ చిత్రం ధనుష్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా రూపొందుతోంది. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలింస్‌ పతాకం పై టి జి త్యాగరాజన్‌ సమర్పణలో సెంధిల్‌ త్యాగరాజన్‌, అర్జున్‌ త్యాగరాజన్‌ నిర్మిస్తున్నారు. జి. శరవణన్, సాయి సిద్ధార్థ్‌లు సహ నిర్మాతలు. భారీ తారాగణం, అత్యున్నత సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు.

ప్రామెసింగ్ హీరో సందీప్ కిషన్ ఒక కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో.. తాజాగా కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ మరో  కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రకటిస్తూ మేకర్స్ సరికొత్త పోస్టర్ ను విడుదల చేశారు. ఈ చిత్రంలో ధనుష్ కి జోడిగా ఇద్దరు కథానాయికలు ప్రియాంక మోహన్, నివేదిత సతీష్ నటిస్తున్నారు. శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. కెప్టెన్ మిల్లర్’ తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్