Sunday, January 19, 2025
Homeసినిమా`క‌ర‌ణ్ అర్జున్‌` ఫ‌స్ట్ లుక్ లాంచ్‌

`క‌ర‌ణ్ అర్జున్‌` ఫ‌స్ట్ లుక్ లాంచ్‌

Karan Arjun: విభిన్న క‌థాంశంతో రూపొందుతోన్నరోడ్ థ్రిల్ల‌ర్ `క‌ర‌ణ్ అర్జున్‌`. రెడ్ రోడ్ థ్రిల్ల‌ర్స్ ప‌తాకంపై అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా హీరో హీరోయిన్లుగా న‌టించ‌గా  మోహ‌న్ శ్రీవ‌త్స ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. డా.సోమేశ్వ‌ర‌రావు పొన్నాన, బాలక్రిష్ణ ఆకుల, సురేష్ ,రామకృష్ణ, క్రాంతి కిరణ్ నిర్మాత‌లు. ర‌వి మేక‌ల ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌. ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్  ను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ విడుదల చేశారు.

“క‌ర‌ణ్ అర్జున్‌ టైటిల్ తో పాటు ఫ‌స్ట్ లుక్ చాలా ఇంట్ర‌స్టింగ్ గా ఉంది. ద‌ర్శ‌కుడు స్టోరి లైన్ కూడా చెప్పారు. ప్ర‌జంట్ ట్రెండ్ కి క‌నెక్ట‌య్యే స్టోరి. టీమ్ అంద‌రూ ఎంతో ప్యాష‌న్ తో సినిమా తీసిన‌ట్లు క‌నిపిస్తోంది. ఈ చిత్రానికి ప‌ని చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ నా శుభాకాంక్ష‌లు” అన్నారు ప‌ర‌శురామ్.

మోహ‌న్ శ్రీవ‌త్స మాట్లాడుతూ “మా సినిమా ఫ‌స్ట్ లుక్ ప‌ర‌శురామ్ గారు లాంచ్ చేయ‌డం చాలా ఆనందంగా ఉంది. వారికి నా ధ‌న్య‌వాదాలు. ఇంత వ‌ర‌కు ఎవ‌రూ చేయ‌ని లొకేష‌న్స్ లో పాకిస్థాన్ బార్డ‌ర్ లో ఎంతో రిస్క్ తీసుకుని  మా సినిమా షూటింగ్ చేశాం. మూడు పాత్ర‌ల‌తో ఊహించని మ‌లుపుల‌తో ప్ర‌తి స‌న్నివేశం ఎంతో ఉత్కంఠ‌భ‌రితంగా సాగే రోడ్ థ్రిల్ల‌ర్ చిత్రమిది. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే ఎమోష‌న్స్ ఉన్నాయి. ఈ సినిమా ఇంత క్వాలిటీగా రావ‌డానికి మా నిర్మాత‌లే కార‌ణం. వారు ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా నాకు పూర్తి స్వేచ్ఛ‌నివ్వ‌డంతో అనుకున్న‌ట్లు గా తీయ‌గ‌లిగాను. మా నిర్మాత‌లంద‌రికీ పేరు పేరునా నా ధ‌న్య‌వాదాలు. సినిమా ఫ‌స్ట్ కాపీ రెడీ అయింది. త్వ‌ర‌లో విడుద‌ల తేదీ ప్ర‌క‌టిస్తాం” అన్నారు.

Also Read : నిఖిల్ పాన్ ఇండియా మూవీ స్పై

RELATED ARTICLES

Most Popular

న్యూస్