Saturday, January 18, 2025
HomeTrending Newsకన్నడ బరిలోకి ఒంటరిగానే కాంగ్రెస్

కన్నడ బరిలోకి ఒంటరిగానే కాంగ్రెస్

కర్నాటకలో వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు సమరానికి సన్నద్ధం అవుతున్నాయి. ఈ దఫా పూర్తి స్థాయి మెజారిటీ సాధించాలనే దిశగా కర్ణాటక కాంగ్రెస్ సమయాత్తమవుతోంది. ఇందులో భాగంగా రాహుల్ గాంధి భారత్ జోడో యాత్ర ను కర్ణాటకలో పార్టీ శ్రేణులకు జోష్ తీసుకొచ్చే విధంగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. మరోవైపు ఈ దఫా ఏ పార్టీతోను పొత్తు ఉండదని రాష్ట్ర నాయకత్వం తేల్చి చెప్పింది. ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్ బెంగళూరు లో నిన్న మీడియాతో  మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీ ఐక్యంగా ఉందనీ, వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తుంద‌ని తెలిపారు. ఎవ‌రితోనూ పొత్తులు పెట్టుకోబోమ‌ని వెల్ల‌డించారు. సమష్టి నాయకత్వంలో పోటీ చేస్తామ‌నీ, 221 మంది స‌భ్యులున్నరాష్ట్ర అసెంబ్లీలో  కాంగ్రెస్‌కు 135 సీట్లకు పైగా వస్తాయన్నారు.

గ‌త కొన్ని నెలలుగా కర్నాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, శివకుమార్ మధ్య విభేదాలు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి పదవికి బలమైన పోటీదారులుగా భావిస్తున్నారు. రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీ పాలిస్తోంది. కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష పాత్రలో ఉంది. వచ్చే ఏడాది మధ్యలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కర్నాటకలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని, ఎన్నికల్లో విజయం సాధించడం లేదని తెలిసి, పోలరైజేషన్‌కు పాల్పడుతోందని డీకే శివకుమార్ పేర్కొన్నారు.

మరోవైపు బిజెపి సీనియర్ నేత యడియూరప్పకు పార్టీ పార్లమెంటరీ బోర్డులోకి తీసుకోవటంతో కన్నడ నాట పార్టీలో ఉత్సాహం కనిపుఇస్తొన్ది. కర్ణాటకలో కాషాయ జెండా రెపరెపలాడేలా చేయటమే తన లక్ష్యమని మాజీ ముఖ్యమంత్రి, బిజెపి సీనియర్ నేత యడియూరప్ప ప్రకటించారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి రావటం ఖాయమని స్పష్టం చేశారు.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్