Sunday, January 19, 2025
Homeసినిమాబన్నీతో కార్తీక్‌ ఆర్యన్‌ మల్టీస్టారర్ ?

బన్నీతో కార్తీక్‌ ఆర్యన్‌ మల్టీస్టారర్ ?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ తో సంచలనం సృష్టించారు. తెలుగులోనే కాక బాలీవుడ్ లో సైతం సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ సినిమా . పుష్ప మానియా విదేశాల్లో సైతం బాగా కనిపించింది. దీంతో అల్లు అర్జున్ తో సినిమా చేసేందుకు టాలీవుడ్ మేకర్స్ మాత్రమే కాదు.. కోలీవుడ్, బాలీవుడ్ మేకర్స్ సైతం ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.  బన్నీతో సినిమాకోసం బోయపాటి శ్రీను, మురుగుదాస్, అట్లీ ఎప్పటి నుంచో  వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది.

ఈ సినిమా తర్వాత బన్నీ ఎవరితో చేస్తారనేది  ప్రకటించలేదు. అయితే.. తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం మహేష్‌ బాబుతో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తైన తర్వాత బన్నీతో సినిమా చేస్తారట. 2023 సెండాఫ్ లో ఈ సినిమా మొదలయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. అయితే… ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్ గా మరో వార్త వినిపిస్తోంది. ఈ సినిమా మల్టీస్టారర్ అని, హిందీ హీరో కార్తీక్‌ ఆర్యన్‌ కూడా ఈ సినిమాలో ఉంటాడని టాక్.

ఇద్దరి ఫ్రెండ్స్ మధ్య జరిగే ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఈ సినిమా అని తెలుస్తోంది. గతంలోనే బన్నీకి త్రివిక్రమ్ ఈ కథ చెప్పాడని, ఆ కథనే ఇప్పుడు సినిమాగా చేయాలనుకుంటున్నాడట. బన్నీ, త్రివిక్రమ్, కార్తీక్‌ ఆర్యన్‌ కాంబినేషన్ అంటే.. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉండే అవకాశం ఉంది. పైగా గతంలో అల్లు అర్జున్ తో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో చిత్రాలతో వరుస హిట్ చిత్రాలు తీశాడు త్రివిక్రమ్. ప్రచారంలో ఉన్నట్టుగా ఈ మూవీ కన్ ఫర్మ్ అయితే.. ఈ క్రేజీ కాంబో మూవీ పై మరింత క్రేజ్ పెరగడం ఖాయం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్