Sunday, January 19, 2025
HomeసినిమాNandamuri Balakrishna: బాలయ్య కోసం.. ఆ ఇద్దరు..?

Nandamuri Balakrishna: బాలయ్య కోసం.. ఆ ఇద్దరు..?

నందమూరి బాలకృష్ణ అఖండ, వీరసింహారెడ్డి చిత్రాలతో వరుసగా సక్సెస్ సాధించారు. ప్రస్తుతం అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో బాలయ్యకు జంటగా కాజల్ నటిస్తుంటే… కూతురుగా శ్రీలీల నటిస్తుండడం విశేషం. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. దసరాకి ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. వరుసగా బ్లాక్ బస్టర్స్ సాధించిన బాలయ్యతో సినిమా చేసేందుకు స్టార్ డైరెక్టర్స్ వెయిటింగ్ లో ఉన్నారు. బోయపాటి, పూరి జగన్నాథ్ బాలయ్యతో సినిమా చేసేందుకు కథలు రెడీ చేసి వెయిట్ చేస్తున్నారు.

అయితే.. ఇప్పుడు మరో ఇద్దరు దర్శకుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఇంతకీ ఎవరంటే.. విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించిన కార్తీక్ దండు. పర్ ఫెక్ట్ థ్రిల్లర్ మూవీని అందించి ఆడియన్స్ ని ఎంతగానో ఎంటర్ టైన్ చేశాడు. అందుకే విరూపాక్ష మూవీ దాదాపుగా 100 కోట్లు వసూలు చేసింది. అయితే.. తదుపరి చిత్రం ఎవరితో అనేది ప్రకటించలేదు కానీ.. కార్తీక్ దండు బాలయ్యతో సినిమా చేసేందుకు కథ రెడీ చేశాడట. రెడీ చేయడమే కాదు.. బాలయ్యను కలిసి కథ చెప్పడం కూడా జరిగిందని.. కాకపోతే ఇంకా కన్ ఫర్మ్ అయ్యిందో లేదో క్లారిటీ రావాల్సివుందని సమాచారం.మరో డైరెక్టర్ ఎవరంటే.. ఇటీవల బలగం సినిమాతో సక్సెస్ సాధించిన వేణు కూడా బాలయ్య కోసం కథ రెడీ చేశాడట. బలగం సినిమాని చిన్న పాయింట్ ను తీసి అందరితో శభాష్ అనిపించుకున్నాడు. దీంతో వేణు తర్వాత సినిమా ఎవరితో అనేది ఆసక్తిగా మారింది. దిల్ రాజు బ్యానర్ లోనే వేణు సినిమా ఉంటుందని అన్నారు. అయితే.. ఎవరితో అనేది ప్రకటించలేదు. ఇప్పుడు వస్తున్న వార్తలు నిజం అయితే మాత్రం వేణు బంపర్ ఆఫర్ దక్కించుకున్నట్టే. మరి.. బాలయ్య, కార్తీక్ దండు, వేణు ఇద్దరికీ ఓకే చెబుతారో..? లేక ఒక్కరికే ఓకే చెబుతారో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్