Wednesday, April 17, 2024
Homeసినిమాయాక్షన్ థ్రిల్లర్ 'కటారి కృష్ణ' ట్రైలర్ విడుదల

యాక్షన్ థ్రిల్లర్ ‘కటారి కృష్ణ’ ట్రైలర్ విడుదల

జాగో స్టూడియో పతాకంపై కృష్ణ , చాణక్య, రేఖా నిరోష, యశ్న చౌదరి, స్వాతి మండల్, చంద్రశేఖర్ తిరుమలశెట్టి, పోసాని కృష్ణ మురళి, మిర్చి మాధవి, టిఎన్ఆర్, డిఎస్ రావు నటీనటులుగా ప్రకాష్ తిరుమల శెట్టిని దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘కటారి కృష్ణ’. ఈ చిత్రాన్ని పి.ఏ. నాయుడు, నాగరాజు తిరుమల శెట్టి సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ ట్రైలర్ హైదరాబాద్, ప్రసాద్ ల్యాబ్ లో సినీ అతిరథుల సమక్షంలో ఘనంగా విడుదలైంది. మురళీ మోహన్ ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్ ను విడుదల చేయగా, తనికెళ్ల భరణి పాటలను విడుదల చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో గౌతంరాజు, చిత్ర యూనిట్ తదితరులు పాల్గొన్నారు.

మురళీ మోహన్ మాట్లాడుతూ “జాగో స్టూడియోపై కొత్త టీం తో అద్భుతమైన చిత్రాన్ని నిర్మించారు. ఇంతకుముందు సినిమా అంటే కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితమయ్యేది. కానీ ఇవాళ్టి రోజున తెలుగు ఇండస్ట్రీకు కొత్త బ్లడ్ చాలా వచ్చింది. అందుకే ఈనాడు  ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్న తెలుగు సినిమాకు మంచి గుర్తింపు లభించడమే గాక తెలుగు ఇండస్ట్రీ ఇంత గొప్పగా ఉంటుందా అనే స్టేజ్ కు ఎదిగింది. అందుకే కొత్త ఆలోచనలతో వస్తున్న ఇలాంటి కొత్త దర్శకులకు, కథా రచయితలు, టెక్నీషియన్స్ కు అవకాశం కల్పిస్తే కొత్త కొత్త కాన్సెప్ట్ ఉన్న కథలు ప్రేక్షకుల ముందుకు వచ్చి గొప్ప విజయం సాధిస్తాయి. కటారి కృష్ణ  ట్రైలర్ చాలా బాగుంది. రొమాంటిక్ సస్పెన్స్ అండ్ యాక్షన్ థ్రిల్లర్  గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాదించి ఈ చిత్ర  యూనిట్ కు మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

తనికెళ్ళ భరణి మాట్లాడుతూ “మా కాలంలో దర్శకుడు అవ్వాలంటే చాలా కష్ట పడవలసి వచ్చేది కానీ ఈ రోజు డిజిటల్ మీడియా పెరగడంతో కొత్తకొత్త కథలతో యూత్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రేక్షకులు మెచ్చేకథతో సినిమా చేస్తే ఆడకపోవడం అనే బాధ లేకుండా థియేటర్స్ లతో పాటు ఓటిటిలో కూడా విడుదల చేసి మంచి పేరు సంపాదించు కుంటున్నారు. యూత్ కు మెచ్చే విధంగా తీసిన ఈ చిత్ర ట్రైలర్,పాటలు బాగున్నాయి. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని అన్నారు.

ఎన్నో యాక్షన్, చేజింగ్ సీక్వెన్స్ లు, థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ ఉన్న ఈచిత్రం ప్రేక్షకులందరికీ నచ్చుతుందని, త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్ చివరివారంలో థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్