కవాల్ టైగర్ రిజర్వ్ (KTR) పై వెబ్ సైట్ ను అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఈ రోజు హైదరాబాద్ లో ప్రారంభించారు. కవాల్ పులుల అభయారణ్యంపై అన్ని వివరాలతో www.kawaltiger.com వెబ్ సైట్ అందుబాటులోకి తీసుకొచ్చారు. పర్యాటకులు, సందర్శకులకు ఉపయోగకరమైన పూర్తి సమాచారం వెబ్ సైట్ లో లభిస్తుందని మంత్రి వెల్లడించారు.
కవాల్ అటవీ ప్రాంతంలో అభివృద్ది చేసిన గడ్డి మైదానాలపై (Grass Lands) ప్రత్యేక బుక్ లెట్ ను ఈ సందర్భంగా మంత్రి విడుదల చేశారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వు (ATR) వార్షిక పరిపాలన నివేదికను మంత్రి చేతుల మీదుగా విడుదల చేసిన అధికారులు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ. శాంతి కుమారి, పీసీసీఎఫ్ ఆర్.ఎం. డోబ్రియాల్, అమ్రాబాద్, కవాల్ టైగర్ రిజర్వు ఫీల్డ్ డైరెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.