Friday, October 18, 2024
HomeTrending Newsకెసిఆర్ బిహార్ పర్యటన హైలెట్స్

కెసిఆర్ బిహార్ పర్యటన హైలెట్స్

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఒక రోజు బీహార్ పర్యటన విజయవంతంగా ముగిసింది. గల్వాన్ లో అమరులైన సైనికుల కుటుంబాలకు, హైదరాబాదు అగ్నిప్రమాదంలో మరణించిన బీహార్ వలస కూలీల కుటుంబాలకు చెక్కులు అందచేశారు. సిఎం కెసిఆర్ పర్యటన వివరాలు… బీహార్ పర్యటన కోసం, బుధవారం ఉదయం 11:30 గంటలకు ప్రగతి భవన్ నుంచి బేగంపేట్ విమానాశ్రయానికి బయలుదేరిన ముఖ్యమంత్రి కేసీఆర్.

12 : 00 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుండి పాట్నాకు ప్రత్యేక విమానంలో బయలుదేరిన సీఎం కేసీఆర్ బృందం..

01 : 54 గంటలకు పాట్నా జయప్రకాశ్ నారాయణ్ విమానాశ్రయానికి చేరుకున్న సీఎం కేసిఆర్.

02 : 10 గంటలకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కార్యాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్, ఘనస్వాగతం పలికి వేదిక పైకి తీసుకెళ్ళిన బీహార్ ముఖ్యమంత్రి.

02 : 18 గంటలకు అమర జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించిన సమావేశం.

02 : 30 గంటలకు ప్రారంభమైన చెక్కుల పంపిణీ కార్యక్రమం.

గల్వాన్ ఘర్షణల్లో వీర మరణం పొందిన భారత సైనికులు.
సునీల్ కుమార్, కుందన్ కుమార్, అమన్ కుమార్,చందన్ కుమార్, జయ్ కిషోర్ ల కుటుంబాలకు,
ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్ధిక సాయాన్ని చెక్కుల రూపం లో అందజేసిన ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు…
కార్యక్రమం లో పాల్గొన్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్.

హైదరాబాదులో జరిగిన అగ్నిప్రమాదం లో మరణించిన…
సికిందర్ రామ్, దినేశ్ కుమార్,
బిట్టూ కుమార్,
దీపక్ రామ్,
సత్యేంద్ర కుమార్,
ఘటీ లాల్ రామ్,
రాజేష్ కుమార్,
అంకజ్ కుమార్ రామ్,
ప్రేమ్ కుమార్,సిందు మహల్దార్,
దామోదర్ మహల్దార్,
రాజేష్ కుమార్ ల కుటుంబాలకు, ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఆర్ధిక సాయాన్ని చెక్కుల రూపం లో, బీహార్ ముఖ్యమంత్రి ఉపముఖ్యమంత్రితో కలిసి, అందజేసిన ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు

చెక్కుల పంపిణీ కార్యక్రమం అనంతరం ప్రసంగించిన తేజస్వి యాదవ్

02 : 46 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం.. అనంతరం.. బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రసంగం

03 : 26 గంటలకు లంచ్ లో పాల్గొన్న సీఎం కేసీఆర్

05 : 20 గంటలకు ఇరువురు ముఖ్యమంత్రుల ప్రెస్ కాన్ఫరెన్స్ ..

మీడియా నుద్దేశించి మాట్లాడిన సీఎం కేసిఆర్.. రాబోయే ఎన్నిక్కల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా నితీష్ కుమార్ పేరును ప్రకటిస్తారా అనే ప్రశ్నకు సమాధానం దాటవేశారు. అదే సమయంలో నితీష్ లేచి నిల్చొని… మీడియా సమావేశం ముగిసింది అన్నట్టుగా సంకేతాలు ఇచ్చ్హారు. అయితే సిఎం కెసిఆర్ నితీష్ ను వారించి మళ్ళీ కూర్చో బెట్టి మీడియా ప్రతినిధులకు వివరణ ఇచ్చారు. నేను ఒక్కడిని కాకుండా అందరం కలిసి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా కెసిఆర్ హిందీలో బాగా మాట్లాడుతున్నారని విలేఖరులు ప్రశంసించారు.

06 : 01 గంటలకు ముగిసిన ప్రెస్ కాన్ఫరెన్స్.. సీఎం కేసిఆర్ ను సత్కరించిన బీహార్ సీఎం.. అనంతరం..

06 : 12 గంటలకు తేజస్వి యాదవ్ నివాసానికి వెళ్ళిన సీఎం కేసీఆర్. తేజస్వీ యాదవ్ తండ్రి….మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ను పలకరించి ఆయన ఆరోగ్యం, యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

06 : 44 గంటలకు ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ నివాసం నుండి పాట్నా గురుద్వారకు బయలుదేరిన సీఎం కేసీఆర్

Kcr Bihar

07 : 02 గంటలకు పాట్నా గురుద్వారకు చేరుకున్న సీఎం కేసీఆర్…సిక్కు మతస్తుల పుణ్య స్థలం గురు గోవింద్ సింగ్ జన్మస్థలం పాట్నా గురుద్వారలో కెసిఆర్ ప్రతేక పూజలు, ప్రార్థనలలో పాల్గొన్నారు.

07 : 22 గంటలకు గురుద్వారాలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న సీఎం కేసిఆర్. ప్రత్యేక పూజల అనంతరం…

08 : 07 గంటలకు గురుద్వారా నుండి పాట్నా విమానాశ్రయానికి బయలుదేరిన సీఎం కేసీఆర్

Kcr Bihar

08 : 23 గంటలకు పాట్నా విమానాశ్రయానికి చేరుకున్న సీఎం కేసీఆర్. బీహార్ పర్యటనలో సీఎం కేసిఆర్ వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, రైతు బంధు సమితి అధ్యక్షులు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్ రెడ్డి,హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్, జాతీయ రైతు సంఘాల నేతలు..తదితరులున్నారు.

Also Read : దేశ చరిత్రలో ఒకే ఒక్కడు కేసీఆర్ నితీష్ కుమార్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్