Names Final: టిఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులను ముఖ్యమంత్రి కేసిఆర్ ఖరారు చేశారు. డా.బండి పార్థసారథి రెడ్డి., వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి), దీవకొండ దామోదర్ రావు లను ఎంపిక చేశారు.
డా.బండి పార్థసారథి రెడ్డి హెటిరో డ్రగ్స్ అధినేతగా; దీవకొండ దామోదర్ రావు నమస్తే తెలంగాణా ఎండీగా కొనసాగుతున్నారు. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) గాయత్రి గ్రానైట్స్ అధినేతగా ఉన్నారు.
బండ ప్రకాష్ స్థానంలో ఖాళీ అయిన ఉపఎన్నిక స్థానానికి ఒకటి… డి.శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీ కాంతారావు పదవీకాలం పూర్తి కావడంతో మిగిలిన రెండు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
ఉపఎన్నిక స్థానానికి గాయత్రి రవిని, పూర్తి కాలం ఉండే రెండు స్థానాలకు , దామోదర్ రావు, డా. బండి పార్థసారథి రెడ్డిలకు అవకాశం కల్పించారు.
గాయత్రీ పదవీకాలం మరో రెండేళ్ళు మాత్రమే ఉంది. ఆయనకు మళ్ళీ అవకాశం కల్పిస్తామనే హామీతో ఉపఎన్నిక అభ్యర్ధిగా ఎంపిక చేశారని తెలుస్తోంది.
Also Read : పల్లెలపై మీ పెత్తనం ఏమిటి? కేంద్రంపై కేసిఆర్ ఫైర్