Monday, January 20, 2025
HomeTrending Newsఏపీకి ఎలా వస్తారు:  కేసిఆర్ కు సోము ప్రశ్న

ఏపీకి ఎలా వస్తారు:  కేసిఆర్ కు సోము ప్రశ్న

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ పై తెలంగాణా మంత్రి కేటిఆర్ చేసిన వ్యాఖ్యలను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఖండించారు.  వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో కూడా టిఆర్ఎస్ ఓటమి పాలవుతుందని జోస్యం చెప్పారు.  వచ్చే ఎన్నికల తర్వాత బిఆర్ఎస్ పార్టీ విఆర్ఎస్ తీసుకోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. జాతీయ పార్టీ పెట్టే హక్కు కేసిఆర్ కు లేదని సోము వ్యాఖ్యానించారు. ఆంధ్రులను గతంలో పాలెగాళ్ళు, ద్రోహులుగా కేసిఆర్ అభివర్ణించారని, అలాంటి నేత జాతీయ పార్టీ ఎలా పెడతారని ప్రశ్నించారు. కేసిఆర్ కు ఆంధ్రాలో అడుగుపెట్టే అర్హత లేదన్నారు. కేసిఆర్ కూతురు కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుకున్నారని అన్నారు.

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిలోనే ఉండాలని సోము పునరుద్ఘాటించారు. బెంగుళూరు- అమరావతి మధ్య ఆరు లైన్ల రహదారిని కేంద్రం మంజూరు చేసిందని గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వానికి అమరావతిపై మమకారం లేదని, రాజధాని ఎన్నికల అంశంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఏపీలో  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి పోటీ చేసుందని, త్వరలోనే తమ పార్టీ అభ్యర్ధులను ప్రకటిస్తామని చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్