సెప్టెంబర్ 3 వ తేదీ క్యాబినెట్ సమావేశం అనంతరం.. తెలంగాణ భవన్లో సాయంత్రం 5 గంటలకు టిఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ సమావేశాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. టిఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ అధ్యక్షతన సాగే ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపీలు కూడా పాల్గొంటారు..
ఈ సందర్భంగా, రాష్ట్రంలో అమలవుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, నూతనంగా అమలు చేస్తున్న పెన్షన్లు, గిరిజనులకు పోడు భూములు,తదితర అంశాలపై ,సమావేశంలో చర్చిస్తారు. రాష్ట్రంలో కొద్ది రోజులుగా దూకుడుగా వ్యవహరిస్తున్న బిజెపి నేతల వైఖరి, వారిని కట్టడి చేసేందుకు పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యాచరణపై సిఎం కెసిఆర్ దిశానిర్దేశం చేస్తారని విశ్వసనీయ సమాచారం.
Also Read : రైతాంగ సమస్యలపై జమిలి పోరాటాలు కెసిఆర్ పిలుపు