‘ఆర్ఆర్ఆర్’ లో కొమరం భీమ్ పాత్రలో నట విశ్వరూపం చూపించారు ఎన్టీఆర్. నార్త్ లో ఎన్టీఆర్ పాత్రకు అనూహ్యమైన స్పందన వచ్చింది. బాలీవుడ్ బడా ఫిల్మ్ మేకర్స్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలని వెయిట్ చేస్తున్నారు. భారీ రెమ్యూనరేషన్ ఇస్తామని భారీ ఆఫర్స్ వస్తున్నప్పటికీ.. ఎన్టీఆర్ మాత్రం కంగారుపడి ఏదో సినిమా చేసేయాలనుకోవడం లేదు. ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
కొరటాల శివతో ఎన్టీఆర్ మూవీని ప్రకటించి చాలా రోజులు అయ్యింది కానీ.. ఇప్పటి వరకు సెట్స్ పైకి వెళ్ళలేదు. నవంబర్ లో ఈ సినిమా స్టార్ట్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. కథ పై బాగా కసరత్తు చేసిన కొరటాల ఎట్టకేలకు ఎన్టీఆర్ ను ఒప్పించాడని తెలిసింది. అయితే… ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ అంటూ అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ పేరు వినిపించింది. ఆతర్వాత ఆలియా భట్ పేరు వినిపించింది.
ఇటీవల క్రేజీ హీరోయిన్ రష్మిక పేరు వినిపించింది. వీళ్లేవరు కాకుండా కీర్తి సురేష్ ను కన్ ఫర్మ్ చేశారంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ఆ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. ఈ చిత్రం లో కీర్తి సురేష్ ఇంకా కన్ఫర్మ్ కాలేదట. దీంతో ఈ భారీ చిత్రంలో ఎన్టీఆర్ మూవీలో నటించే లక్కీ ఛాన్స్ ఎవరికి వస్తుంది అనేది ఆసక్తిగా మారింది. మరి.. త్వరలోనే క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.
Also Read : బుచ్చిబాబును టెన్షన్ పెడుతున్న ఎన్టీఆర్?