ప్రముఖ సాహితీవేత్త, కథా రచయిత కేతు విశ్వనాథరెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. రెండు రోజుల కిందట ఒంగోలులో ని కుమార్తె ఇంటికి వెళ్ళిన కేతు విశ్వనాథరెడ్డికి తెల్లవారుజామున ఐదున్నర గంటల ప్రాంతంలో గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయన్ను కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు.
వైఎస్ఆర్ జిల్లా కమలాపురం తాలూకా రంగశాయిపురంలో 1939 జూలై 10న కేతు జన్మించారు. ‘కేతు విశ్వనాథ రెడ్డి కథలు’ అనే కథా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. రాయలసీమ ప్రాంతంలో జన్మించి తెలుగు సాహితీ రంగంలో పేరెన్నిక గన్న కవుల్లో కేతు అగ్రగణ్యుడిగా నిలిచారు.
కేతు విశ్వనాథరెడ్డి హఠాన్మరణం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆధునిక తెలుగు సాహితీ రంగానికి విశ్వనాథరెడ్డి అందించిన సేవలు చిరస్మరణీయమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అని సీఎం కొనియాడారు. సామాజిక సంస్కరణలను అవశ్యకతను చెబుతూ విశ్వనాథరెడ్డి రాసిన కథలు పలువురికి స్ఫూర్తిగా నిలిచాయని సీఎం అన్నారు. ఆయన సేవలను గుర్తించి 2021లో వైయస్సార్ లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డుతో రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ని సత్కరించిన విషయాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు. విశ్వనాథ్‌రెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.