Sunday, January 19, 2025
Homeసినిమామహేష్‌, త్రివిక్రమ్ మూవీలో కీలక మార్పులు.

మహేష్‌, త్రివిక్రమ్ మూవీలో కీలక మార్పులు.

మహేష్‌ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత హ్యాట్రిక్ మూవీ రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఇందులో పూజా హేగ్డే నటిస్తుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఆమధ్య ఫస్ట్ షెడ్యూల్ లో యాక్షన్ సీన్స్ చిత్రీకరించారు. దీంతో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది.

అయితే… ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత మహేష్‌ బాబు అసంతృప్తితో ఉన్నారని.. కథలో మార్పులు చేర్పులు చేయమన్నారని వార్తలు వచ్చాయి. అంతే కాకుండా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వార్తలు కూడా రావడం జరిగింది. ఇలా వార్తలు వచ్చిన ప్రతిసారీ నిర్మాణ సంస్థ అలాంటిది ఏమీ లేదని క్లారిటీ ఇచ్చేది. ఇప్పుడు అంతా సెట్ అయ్యిందని త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేయనున్నారని తెలిసింది. ఈసారి త్రివిక్రమ్ కథను మొత్తం మార్చేశారని టాక్ వినిపిస్తోంది.

కారణం ఏంటంటే.. ముందు అనుకున్న కథలో యాక్షన్ పార్ట్ ఎక్కువుగా ఉందట. పైగా ఫస్ట్ షెడ్యూల్ లో చిత్రీకరించిన యాక్షన్ పార్ట్ మహేష్‌ బాబుకు ఏమాత్రం నచ్చలేదట. అందుకనే సెకండ్ షెడ్యూల్ కి ఇంత గ్యాప్ వచ్చిందట. మహేష్ చెప్పడంతో ఆ కథని పక్కన పెట్టి మరో కొత్త కథతో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారట. అలాగే ఫస్ట్ నుంచి త్రివిక్రమ్ పాన్ ఇండియా మూవీగా చేద్దామని అంటుంటే.. మహేష్‌ వద్దని తెలుగులో మాత్రమే తీద్దామనే వారట. ఇప్పుడు మహేష్ త్రివిక్రమ్ ని ఒప్పించారని… పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. మరి… మహేష్, త్రివిక్రమ్ కలిసి ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తారో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్