Friday, October 18, 2024
Homeసినిమాఆర్ఆర్ఆర్, బాహుబ‌లి-2 రికార్డుల‌ను కేజీఎఫ్ 2 బ్రేక్ చేస్తుందా?

ఆర్ఆర్ఆర్, బాహుబ‌లి-2 రికార్డుల‌ను కేజీఎఫ్ 2 బ్రేక్ చేస్తుందా?

RRR-KGF-2: క‌న్న‌డ స్టార్ హీరో య‌ష్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్లో రూపొందిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ కేజీఎఫ్ 2. ఈనెల 14న భారీ అంచ‌నాల‌తో ప్ర‌పంచవ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకువ‌చ్చింది. కేజీఎఫ్ 1 స‌క్సెస్ అవ్వ‌డంతో కేజీఎఫ్ 2 కూడా స‌క్సెస్ అవుతుంద‌నే టాక్ ఉంది అలాగే.. ఎలా ఉంటుందో అనే డౌట్ కూడా ఉంది. అయితే.. ఫ‌స్ట్ డే.. ఫ‌స్ట్ షో నుంచే బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ సొంతం చేసుకుంది.

క‌న్న‌డ‌, తెలుగు, త‌మిళ్, మ‌ల‌యాళం, హిందీ.. ఇలా అన్ని భాష‌ల్లో.. అన్ని ఏరియాల్లో రికార్డు క‌లెక్ష‌న్స్ తో దూసుకెళుతోంది. రిలీజ్ కి ముందు అడ్వాన్స్ బుకింగ్స్ లో స‌రికొత్త‌ రికార్డులు క్రియేట్ చేసిన కేజీఎఫ్ 2 రిలీజ్ త‌ర్వాత ఊహించ‌ని రికార్డ్స్ తో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది. రిలీజ్ మొదటి రోజు దాదాపు అన్ని భాషల్లో 165 కోట్లు కలెక్ట్ చేసిన ఈ చిత్రం తమిళనాడులో తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాల్లో నెంబర్ వన్‌గా నిలిచింది.

ఇక నాలుగు రోజుల క‌లెక్ష‌న్స్ విష‌యానికి వ‌స్తే.. మొదటిరోజు 165.37 కోట్లు, రెండోరోజు 139.25 కోట్లు, మూడోరోజు 115.08 కోట్లు, నాలుగోరోజు 132.13 కోట్లు. మొత్తం 551.83 కోట్లు క‌లెక్ట్ చేసి సంచ‌ల‌నం సృష్టించింది. నాలుగు రోజుల‌కే 500 కోట్ల‌కు పైగా క‌లెక్ట్ చేస్తే.. ఇక ఫుల్ ర‌న్ లో ఎంత క‌లెక్ట్ చేయ‌నుంది అనేది ఆస‌క్తిగా మారింది. ఆర్ఆర్ఆర్ దాదాపు 1100 కోట్లు క‌లెక్ట్ చేసింది. బాహుబ‌లి 2… 1800 కోట్లు క‌లెక్ట్ చేసింది. ఈ రెండింటిలో ఏ రికార్డ్ ను కేజీఎఫ్ 2 క్రాస్ చేయ‌నుందనేది హాట్ టాపిక్ గా మారింది.

Also Read : ఫస్ట్ డే క‌లెక్ష‌న్స్ లో ‘కేజీఎఫ్-2 స‌రికొత్త రికార్డ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్