జగిత్యాల పట్టణంలో కింగ్ ఫిషర్ బీర్లు అమ్మడం లేదని ఈ రోజు ప్రజావాణిలో ఓవ్యక్తి పిర్యాదు చేశారు. జగిత్యాల పట్టణంలో కింగ్ ఫిషర్ బీర్లు అమ్మడం లేదని కింగ్ ఫిషర్ బీర్లు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ జగిత్యాల ప్రజావాణిలో అదనపు కలెక్టర్ బి.ఎస్. లత కు బీరం రాజేష్ అనే వ్యక్తి వినతి పత్రం అందజేశారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ఏర్పాటుచేసిన ప్రజావాణి కార్యక్రమంలో బీరుపై ఫిర్యాదు రావడంతో అధికారులతోపాటు పట్టణవాసులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ ఫిర్యాదు అందుకున్న అధికారులు దాన్ని అబ్కారీ శాఖకు బదిలీ చేశారు.
గతంలో కూడా ఇదే మాదిరి ఫిర్యాదు చేశారు. జగిత్యాలలో మద్యం వ్యాపారులు కింగ్ ఫిషర్ బీరును అమ్మడం లేదంటూ పట్టణానికి చెందిన సూర్యనారాయణ అనే వ్యక్తి ప్రజా వాణిలో ఫిర్యాదు చేశారు. అంతేగాక, యువతకు ఇష్టమైన బీరును తెప్పించటం లేదని.. వ్యాపారులు సిండికేట్‌గా మారి కింగ్‌ఫిషర్ బీరు అమ్మకాలు చేయడం లేదని ఫిర్యాదులో వివరించాడు.
బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి లండన్ చెక్కేసిన విజయ్ మాల్యాను భారత్‌కు తిరిగి రప్పించడానికి అధికారులు ఓ వైపు నానా తంటాలు పడుతుంటే.. తెలంగాణకు చెందిన కింగ్‌ఫిషర్ లవర్ ఆ బ్రాండ్ అమ్మకాల కోసం ప్రభుత్వానికే అర్జీ పెట్టుకోవడం సంచలనంగా మారింది.