Sunday, January 19, 2025
HomeసినిమాKiran Abbavaram: కుర్ర హీరోకి ఇంత గట్టి పోటీ ఎదురైంది ఇప్పుడేనేమో!

Kiran Abbavaram: కుర్ర హీరోకి ఇంత గట్టి పోటీ ఎదురైంది ఇప్పుడేనేమో!

సినిమా తప్ప నాకు ఏమీ తెలియదు .. సినిమా గురించి తప్ప నేను దేని గురించీ ఆలోచించను అని చెప్పుకుంటూ వస్తున్న హీరో కిరణ్ అబ్బవరం. ఇండస్ట్రీలో ఉన్న కుర్ర హీరోలు ఎక్కువే. వాళ్లలో బలమైన సినిమా నేపథ్యం ఉన్నవారు కూడా ఉన్నారు. అలాంటివారిని దాటుకుని తనకంటూ కొన్ని అవకాశాలను తెచ్చుకోవడం చాలా కష్టమైన పనే. అయినా ఎలాంటి గ్యాప్ లేకుండా కిరణ్ వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు.

కిరణ్ చేస్తున్న సినిమాలు ఓ మాదిరి బడ్జెట్ సినిమాలే అయినా, అవి పెద్ద బ్యానర్ల నుంచి రావడం  విశేషం. అలా కిరణ్ నుంచి త్వరలో రానున్న ‘మీటర్’ కూడా పెద్ద బ్యానర్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను మైత్రీ – క్లాప్ సంస్థలు కలిసి నిర్మించాయి. ‘అతుల్య రవి’ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, పోసాని .. పృథ్వీ వంటి సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. ఇది పక్కా మాస్ మూవీ అనీ .. ఇది మాస్ ‘మీటర్’ అని కిరణ్ చెబుతూ వస్తున్నాడు. అయితే ఈ సినిమా ‘రావణాసుర’తో పాటు థియేటర్లలో దిగుతుండటమే విశేషం.

రవితేజ హీరోగా ‘రావణాసుర’ సినిమా రూపొందింది. అభిషేక్ పిక్చర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమా ఇది. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రొమాన్స్ పాళ్లు కూడా ఎక్కువే. ఐదుగురు హీరోయిన్స్ తో ఇచ్చిన గ్లామర్ టచ్ కూడా ఎక్కువే. ఇక క్రితం వారం విడుదలైన నాని ‘దసరా’ సినిమా రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతూ రన్నింగ్ లో ఉంది. ఇది కూడా మాస్ మూవీనే. ఇక రవితేజ ‘రావణాసుర’ కూడా పక్కా మాస్ సినిమానే. మరి ఈ రెండు సినిమాల మధ్య మాస్ కంటెంట్ తో కిరణ్ ఎంతవరకూ తట్టుకుంటాడనేది చూడాలి. బహుశా ఆయన కెరియర్లో ఇంత గట్టిపోటీ ఎదురుకావడం ఇదే ఫస్టు టైమ్ అయ్యుంటుంది.

Also Read : Meter Trailer: ‘మీటర్’ ట్రైలర్ విడుదల

RELATED ARTICLES

Most Popular

న్యూస్