Sunday, February 23, 2025
Homeసినిమాకిరణ్ అబ్బవరం 'సెబాస్టియన్' సెన్సార్ పూర్తి

కిరణ్ అబ్బవరం ‘సెబాస్టియన్’ సెన్సార్ పూర్తి

Censored: యువ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం, నువేక్ష మరియు కోమలి ప్రసాద్ హీరో, హీరోయిన్లుగా న‌టించిన చిత్రం “సెబాస్టియన్”. ఈ చిత్రానికి బాలాజీ స‌య్య‌పురెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. విభిన్న క‌థాంశంతో రూపొందిన ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయ్యింది. ఈ సంద‌ర్భంగా సెబాస్టియ‌న్ సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ని అందజేసింది.

ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో ఫన్నీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం పోలీస్ గా న‌టించాడు. ఈ మూవీ టీజ‌ర్ అండ్ సాంగ్స్ కు అనూహ్య‌మైన స్పంద‌న రావ‌డంతో సినిమా పై పాజిటివ్ టాక్ ఉంది. బి సిద్దిరెడ్డి, రాజు మరియు ప్రమోద్ లు ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే మార్చ్ 4న రిలీజ్ కానుంది. మ‌రి.. వ‌రుస‌గా విజ‌యాలు సాధిస్తున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం ఈ సినిమాతో మ‌రో విజ‌యం సాధిస్తాడేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్