IPL-2022: ఐపిఎల్ 14వ సీజన్ అట్టహాసంగా ఆరంభమైంది. ముంబై, వాంఖేడే స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్ లో డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ పై కోల్ కతా నైట్ రైడర్స్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
కోల్ కతా కెప్టెన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇన్నింగ్స్ 2 పరుగుల వద్ద చెన్నై తొలి వికెట్ (రుతురాజ్ గైక్వాడ్ డకౌట్) కోల్పోయింది.28 వద్ద డేవాన్ కాన్వే(3) కూడా ఔటయ్యాడు. రాబిన్ ఊతప్ప మెరుపు ఇన్నింగ్స్ ఆడి 21 బంతుల్లో 2 ఫోర్లు, 2సిక్సర్లతో 28 పరుగులు చేసి, అంబటి రాయుడు 15 పరుగులు చేసి ఔటయ్యారు. శివమ్ దూబె కూడా మూడు పరుగులకే పెవిలియన్ చేరుకున్నాడు. కెప్టెన్ జదేజా, మిస్టర్ కూల్ ధోనీ మరో వికెట్ పడకుండా నెమ్మదిగా ఆడి చివర్లో ధాటిగా ఆడి ఆరో వికెట్ కు అజేయమైన 70 పరుగులు జోడించారు. ధోనీ అర్ధ సెంచరీ(50), జదేజా 26 పరుగులతో నాటౌట్ గా నిలిశారు. 20 ఓవర్లలో చెన్నై ఐదు వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది.
కోల్ కతా బౌలర్లలో ఉమేష్ యాదవ్ కు రెండు; వరుణ్ చక్రవర్తి, రస్సెల్ చెరో వికెట్ పడగొట్టారు.
ఆ తర్వాత బ్యాటింగ్ మొదలు పెట్టిన కోల్ కతా మొదటి వికెట్ కు 43 పరుగులు చేసింది. వెంకటెష్ అయ్యర్ 16 పరుగులు చేసి ఔటయ్యాడు. నితీష్ రానా-21 చేయగా, మరో ఓపెనర్ అజింక్యా రేహానే చురుగ్గా ఆడి 34 బంతుల్లో6 ఫోర్లు, సిక్సర్ తో44, శామ్ సిబ్లింగ్స్ 25 పరుగులు చేసి ఔటయ్యారు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 20 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. చెన్నై బౌలర్లలో డ్వేన్ బ్రావో మూడు; మిచెల్ శాంట్నర్ ఒక వికెట్ సాధించారు.
ఉమేష్ యాదవ్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.