Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్రాజస్థాన్ పై కోల్ కతా విజయం

రాజస్థాన్ పై కోల్ కతా విజయం

Kolkata won: ఐపీఎల్ లో కోల్ కతాకు ఐదు ఓటముల తర్వాత ఓ విజయం దక్కింది.  నేడు జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కోల్ కతాలో నితీష్ రానా, రింకూ సింగ్, శ్రేయాస్ అయ్యర్ లు బ్యాటింగ్ లో రాణించి విజయం అందించారు.

ముంబైలోని వాంఖేడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో కోల్ కతా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రాజస్థాన్ 7 పరుగులకే తొలి వికెట్ (దేవదత్ పడిక్కల్-2) కోల్పోయింది. కెప్టెన్ సంజూ శామ్సన్-54; హెట్ మెయిర్-27; జోస్ బట్లర్ -22 పరుగులు చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 152 పరుగులు చేసింది. కోల్ కతా బౌలర్లలో టిమ్ సౌతీ రెండు; ఉమేష్ యాదవ్, అనుకూల్ రాయ్, శివమ్ మావి తలా ఒక వికెట్ పడగొట్టారు.

కోల్ కతా 16 పరుగుల వద్ద తొలి వికెట్ (పించ్-4) కోల్పోయింది, 32 వద్ద మరో ఓపెనర్ ఇంద్రజీత్ (15) కూడా  ఔటయ్యాడు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్-నితీష్ రానా మూడో వికెట్ కు 60 పరుగులు జోడించారు.  జట్టు స్కోరు 92 వద్ద 34 పరుగులు చేసిన శ్రేయాస్ వెనుదిరిగాడు. ఆ తర్వాత రానా- రింకూ సింగ్ లు కలిసి మరో వికెట్ పడకుండా 19.1 ఓవర్లలో విజయం సాధించి పెట్టారు. రానా 37 బంతుల్లో 3 ఫోర్లు, 2సిక్సర్లతో 48; రింకూ సింగ్ 23 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్ తో 42 పరుగులతో అజేయంగా నిలిచారు. నితీష్ రానా విన్నింగ్ షాట్ సిక్సర్ తో కోల్ కతా విజయం సొంతం చేసుకుంది.

రాజస్థాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ కృష్ణ, కుల్దీప్ సేన్ తలా ఒక వికెట్ సాధించారు.

రింకూ సింగ్ కు ‘మ్యాన్ అఫ్ ద మ్యాచ్’ లభించింది.

Also Read : కోల్ కతాపై ఢిల్లీ విజయం

RELATED ARTICLES

Most Popular

న్యూస్