మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామాపై ఆయన సోదరుడు ఎంపి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఈ రోజు ఢిల్లీలో నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఆమోదించిన తర్వాత ఉపఎన్నికలు, ఫలితాలు తదితర పరిణామాలను బట్టి తను నిర్ణయం తీసుకుంటానన్నారు. సోదరుడి పార్టీ మార్పు నిర్ణయంతో తనకు సంబంధం లేదని, తను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను తాను ఎప్పుడు కలవలేదని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడిని తను కలవటంలో ఎలాంటి రాజకీయం లేదని తేల్చి చెప్పారు. కేవలం తన నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసమే కలిశానని చెప్పారు.
మాది ఉమ్మడి కుటుంబమని సోదరులు ఇద్దరు వేర్వేరు పార్టీల్లో ఉంటే తప్పు ఎలా అవుతుందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిన్న అన్నారు. అయితే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తమ కుటుంబం గురిచి తప్పుగా మాట్లాడారని అన్నారు. పదేపదే మీరు అని సంబోదించి తన సోదరుడితో తనపై కూడా విమర్శలు చేశారని ఆరోపించారు. ఇందుకు రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 34 ఏళ్లుగా పార్టీ కోసం నా రక్తం ధార పోశానని, నన్ను రెచ్చగొట్టొద్దని హెచ్చరించారు. టిడిపి ఎమ్మెల్యే గా ఉండీ రేవంత్ కాంగ్రెస్ లో చేరాడని, రేవంత్ కామెంట్స్ బాదించాయన్నారు.
Also Read : మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామా